Weather

Rain Alert: ఏపీ, తెలంగాణకు 5 రోజులు వర్ష సూచన.. జోరుగా నైరుతీ రుతుపవనాలు

Published

on

Rain Alert for Andhra Pradesh and Telangana: ఈ సంవత్సరం టైమ్ ప్రకారం వానలు కురుస్తున్నాయి. గత 3 ఏళ్లుగా ఈ పరిస్థితి లేదు. ఈ సంవత్సరం ఏప్రిల్‌లోనే తీవ్ర ఎండలు వచ్చేయడంతో.. అప్పుడు తయారైన మేఘాలకు నైరుతీ రుతుపవనాలు కలవడంతో.. త్వరగా వర్షాలు వచ్చేశాయి. ఇవాళ వాతావరణం ఎలా ఉంటుందో చూద్దాం.
నైరుతీ రుతుపవనాలు క్రమంగా మధ్య అరేబియా సముద్రం, కోస్తాంధ్ర, తెలంగాణ, దక్షిణ మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, దక్షిణ ఒడిశాలో విస్తరిస్తున్నాయి. కొన్ని ఉత్తర గాలులు.. నిజామాబాద్, విజయనగరం గుండా వెళ్తున్నాయి. ఈ 2 రోజుల్లో నైరుతీ రుతుపవనాలు తెలంగాణ అంతటా విస్తరించేందుకు వీలు ఉందని భారత వాతావరణ విభాగం (IMD) చెప్పింది.

శాటిలైట్ ప్రెసిపిటేషన్ అంచనాల ప్రకారం.. కోస్తాకి పక్కన బంగాళాఖాతంలో ఓ అల్పపీడనం ఏర్పడి.. దాని నుంచి వస్తున్న మేఘాలు కోస్తాంధ్ర, రాయలసీమపై విస్తరిస్తున్నాయి. ఈ రోజంతా (9 జూన్ 2024 ఆదివారం) తెలుగు రాష్ట్రాల్లో మేఘాలు ఉంటాయి. మధ్యాహ్నం 3 తర్వాత విశాఖలో చిన్నగా వాన పడుతుంది. అలాగే పశ్చిమ తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తుంది. ఇది రాత్రి 11 గంటల వరకూ కురుస్తూనే ఉంటుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version