International

కెన్యాలో నిరసనకారులు విధ్వంసం- పార్లమెంట్​కు నిప్పు- ఇద్దరు పౌరులు మృతి

Published

on

Kenya Protests 2024 : కెన్యా ప్రభుత్వం ప్రకటించిన కొత్త పన్నుకు వ్యతిరేకంగా ఆ దేశంలో జరుగుతోన్న నిరసనలు తీవ్రరూపం దాల్చాయి. కెన్యా రాజధాని నైరోబిలోని పార్లమెంట్‌లోకి ప్రవేశించి ఆందోళనకారులు బీభత్సం సృష్టించారు. పార్లమెంట్‌ భవనంలోని సామగ్రిని విరగ్గొట్టారు. కుర్చీలు, బల్లలు, తలుపులు, అద్దాలను పగలగొట్టారు. అక్కడితో శాంతించని నిరసనకారులు, విరగ్గొట్టిన కుర్చీలు, బల్లలను పోగేసి ఏకంగా పార్లమెంట్‌లోని ఓ విభాగానికి నిప్పంటించారు.

అంతకుముందు పార్లమెంట్‌ భవనం ముట్టడికి ప్రయత్నించిన ఆందోళనకారులపై పోలీసులు లాఠీఛార్జ్‌ చేశారు. దాంతోపాటు జలఫిరంగులు, బాష్పవాయువు గోళాలను ప్రయోగించడం వల్ల పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఇద్దరు కెన్యా పౌరులు మరణించగా, వందలాది మంది గాయడ్డారు. దీంతో కోపోద్రిక్తులైన నిరసనకారులు పార్లమెంట్‌లోకి ప్రవేశించి విధ్వంసం సృష్టించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version