Andhrapradesh

పవన్ కొత్త బాధ్యతలు ఖరారు చేసిన చంద్రబాబు – ఏరి కోరి..!!

Published

on

ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరనుంది. ఈ నెల 12న ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కొద్ది రోజులుగా పవన్ ప్రభుత్వంలో చేరుతారా లేదా అనే ఒక సందిగ్ధత కొనసాగింది. దీని పైన పవన్ క్లారిటీ ఇచ్చారు. చంద్రబాబు సూచన మేరకు పవన్ భవిష్యత్ బాధ్యతల పైన ఒక నిర్ణయానికి వచ్చారు. దీంతో..కొత్త ప్రభుత్వంలో పవన్ పాత్ర స్పష్టమైంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలే ప్రాధాన్యత అని తేల్చి చెప్పారు.
మంత్రివర్గంలోకి పవన్
ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వంలో పవన్ కీలక బాధ్యతలకు సిద్దమయ్యారు. ప్రస్తుతం చేతిలో సినిమాలు ఉండటంతో మంత్రివర్గంలో చేరాలా వద్దా అనే అంశం పైన పవన్ కొద్ది రోజులుగా డైలమాలో ఉన్నారు. అయితే, ప్రజలకు ఇచ్చిన హామీల అమల్లో భాగంగా ప్రభుత్వంలో చేరాలని నిర్ణయించారు. తాజాగా, ఒక జాతీయ మీడియాతో పవన్ ఈ విషయాన్ని స్పష్టం చేసారు. ఇదే అంశం పైన చంద్రబాబు – పవన్ మధ్య చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. జనసేనకు నాలుగు మంత్రి పదవులు దక్కనున్నట్లు సమాచారం. జనసేన నుంచి ఎవరికి మంత్రి పదవులు ఇవ్వాలి.. ఏ శాఖలు ఇవ్వాలనే దాని పైన ఇద్దరూ ఒక నిర్ణయానికి వచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version