National

పోలింగ్ ముగిసిన తర్వాత ఏపీకి శుభవార్త వినిపించిన కేంద్రం

Published

on

ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు భారతీయ రైల్వే శుభవార్త వినిపించింది. భారత్ గౌరవ్ టూరిస్టు రైలు రాష్ట్రం మీదగా నడవబోతోంది. నేపాల్, ముక్తినాథ్, దివ్యదేశం యాత్రకు ప్రత్యేక ప్యాకేజీతో ఈ రైలును నడుపుతున్నారు. జూన్ 7వ తేదీన చెన్నైలో బయలుదేరుతుంది. తిరిగి జూన్ 19వ తేదీన తిరుగు ప్రయాణమవుతుంది. భారత్ గౌరవ్ రైలు విజయవాడ డివిజన్ పరిధిలోని గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, గుంటూరు, మిర్యాలగూడ, సికింద్రాబాద్, ఖాజీపేట స్టేషన్ల మీదగా ప్రయాణిస్తుంది. అలాగే ముక్తినాథ్, ఖాట్మండ్, నైమిశారణ్యం, అయోధ్య, పశుపతినాథ్ కూడా వెళుతుంది.


అన్నింటికీ కలిపే టికెట్లు
ఈ రైలులో ప్రయాణించాలనుకునే భక్తులకు ఛార్జీల వివరాలను కూడా అధికారులు తెలిపారు. స్లీపర్ లో రూ.45,900, థర్డ్ ఏసీలో రూ.54,900, సెకండ్ ఏసీలో 59,950గా నిర్ణయించారు. టీ, టిఫిన్, భోజనం, హోటల్ గదులు, రవాణాతో కలిపే వీటిని వసూలు చేస్తున్నారు. ఇతర వివరాలకు 93550 21516 నెంబరులో సంప్రదించాలని సూచించారు. ఆసక్తి ఉన్నవారు వెంటనే టికెట్లు బుక్ చేసుకోవాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version