Andhrapradesh
పోలీసులకే షాక్ కళ్ళు జిగేల్
ఎన్నికల వేళ ఏపీలో అధికారులు తనిఖీలు ముమ్మురం చేశారు. పోలీసులతో పాటుగా ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్‌లు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీల్లో పలుచోట్ల భారీగా బంగారం, నగదు పట్టుబడుతోంది.
తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీచేస్తున్న కాకినాడ జిల్లా పిఠాపురంలో భారీగా బంగారం, వెండి నగలు పట్టుబడ్డాయి. గొల్లప్రోలు టోల్ ప్లాజా వద్ద తనిఖీలు నిర్వహించిన పోలీసులు.. ఓ మినీవ్యానులో రూ. 17 కోట్ల విలువైన బంగారం, వెండి నగలను తరలిస్తున్నట్లు గుర్తించారు.తరలిస్తున్న బంగారం, వెండి అభరణాలకు సంబంధించి సరైన డాక్యుమెంట్స్ లేకపోవడంతో సీజ్ చేసి కాకినాడలోని జిల్లా ట్రెజరీ కార్యాలయానికి తరలించారు.