National

PM Modi Tour: కజిరంగా నేషనల్ పార్క్‌లో సఫారీ రైడ్‌ను ఆస్వాదించిన ప్రధాని మోదీ.. ఏనుగుపై స్వారీ చేస్తూ..

Published

on

ప్రధాని కజిరంగా నేషనల్ పార్క్‌లో జంగిల్ లో సఫారీ రైడ్ ను ఎంజాయ్ చేశారు. మార్చి 8 సాయంత్రం కజిరంగా నేషనల్ పార్క్‌లో ప్రధాని బస చేశారు. ఈ రోజు ఉదయం జీపులో కొంత సేపు, ఏనుగుపై స్వారీ చేస్తూ కజిరంగా నేషనల్ పార్క్‌ను సందర్శించారు. అస్సాంలో 18 వేల కోట్ల రూపాయల కంటే ఎక్కువ విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోడీ నేడు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేయనున్నారు.

దేశ వ్యాప్తంగా ఎన్నికల నగారా త్వరలో మ్రోగనున్న వేళ.. మన ప్రధాని మోడీ దేశంలోని వివిధ ప్రాంతాల్లోని ప్రాముఖ్య పట్టణాలను దర్శిస్తూ బిజిబిజీ గడుపుతున్నారు. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ అస్సాంలో పర్యటిస్తున్నారు. ఈ సమయంలో ప్రధాని కజిరంగా నేషనల్ పార్క్‌లో జంగిల్ లో సఫారీ రైడ్ ను ఎంజాయ్ చేశారు.


రెండు రోజుల పాటు అసోం పర్యటిస్తున్న ప్రధాని మోదీ..ఈ ఉదయం యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం కాజిరంగా నేషనల్ పార్క్ అండ్‌ టైగర్ రిజర్వ్‌కు వెళ్లారు..నేషనల్ పార్క్ లోపల ప్రధాని ఏనుగుపై సఫారీ చేశారు..అరుణాచల్ ప్రదేశ్‌కు బయలుదేరుతారు.

Advertisement

అసోంలో పర్యటన భాగంగా ఆయన 18వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారు..ఇక మరికాసేపట్లో అక్కడి నుంచి నేరుగా అరుణాచల్ ప్రదేశ్‌కు బయలుదేరుతారు ప్రధాని..

అరుణాచల్‌ప్రదేశ్‌లో పలు కార్యక్రమాలకు హాజరైన తర్వాత, ప్రధాని మధ్యాహ్నం జోర్హాట్‌ను సందర్శిస్తారు, అక్కడ హోలోంగా పథర్‌లో 84 అడుగుల ఎత్తైన అహోం యోధుడు లచిత్ బోర్ఫుకాన్ విగ్రహాన్ని ప్రారంభిస్తారు.

అనంతరం జోర్హాట్‌లోని మెలెంగ్ మెటెలి పోతార్‌లో జరిగే బహిరంగ సభలో మోదీ ప్రసంగిస్తారు. అలాగే ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన కింద నిర్మించిన 5 లక్షల 50 వేలకు పైగా గృహాలకు ‘గృహ ప్రవేశ’ వేడుకను ప్రధాని నిర్వహించనున్నారు.

కజిరంగా నేషనల్ పార్క్‌లో జంగిల్లో సఫారీ రైడ్ ను ఎంజాయ్ చేసిన ప్రధాని మోదీ.. కెమెరాను చేతపట్టుకుని.. స్వయంగా ఫొటోలను క్లిక్ మనిపించారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న సిబ్బందితో ఆప్యాయంగా మాట్లాడారు.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version