Hashtag

PM Modi: సముద్రపు దొంగలపై నేవీ ఆపరేషన్ సక్సెస్.. ప్రధాని మోడీకి బల్గేరియా అధ్యక్షుడి ప్రత్యేక కృతజ్ఞతలు

Published

on

అరేబియా సముద్రంలో సోమాలియా దొంగల చేతిలో హైజాక్ కు గురైన ఎం వీ రూయెన్ అనే వాణిజ్య ఓడను భారత నౌకాదళం ప్రాణాలకు తెగించి కాపాడింది. ఐఎన్‌ఎస్‌ కోల్‌కతా, ఐఎన్‌ఎస్‌ సుభద్రలతోపాటు సీ గార్డియన్‌ డ్రోన్ల సహాయంతో సక్సెస్ ఫుల్ గా రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించింది. ఆపరేషన్ లో భాగంగా భారత వాయుసేన తన సీ-17 రవాణా విమానం ద్వారా రెండు చిన్న పాటి యుద్ధ బోట్లను కచ్చితమైన ప్లేస్ లో జారవిడిచింది. మెరైన్ కమెండోలు కిందికి దిగి సముద్రపు దొంగల ఆట కట్టించారు. అలాగే బందీలను విడిపించారు. కాగా ఈ నౌకా సిబ్బందిలో ఏడుగురు బల్గేరియా జాతీయులు ఉన్నారు. దీనిపై ఆ దేశ అధ్యక్షుడు రామన్ రాదేవ్ సోషల్ మీడియా వేదికగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి, భారత ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ‘ సముద్రపు దొంగల చేతికి చిక్కన రూయెన్ నౌకను, అందులోని ఏడుగురు బల్గేరియా జాతీయలను రక్షించడం కోసం భారత నౌకా దళం ఎంతో ధైర్య సాహసాలను ప్రదర్శించింది. మా దేశస్థులను కాపాడినందుకు భారత నేవీ సిబ్బందికి, అలాగే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ప్రత్యేక కృతజ్ఞతలు’ అని ట్వీట్ చేశారు బల్గేరియా అధ్యక్షులు.

అంతకు ముందు బల్గేరియా ఉప ప్రధాని, విదేశాఖమంత్రి మారియా గాబ్రియెల్ కూడా భారత్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు . ‘రూయెన్ నౌకను కాపాడడంలో మీరు అందించిన సహకారానికి ధన్యవాదాలు. సిబ్బంది రక్షణ కోసం కలిసి పనిచేస్తాం’ అని అన్నారు. దీనికి భారత విదేశాంగమంత్రి జై శంకర్ కూడా స్పందించారు. ‘స్నేహితులు ఉన్నది అందుకే కదా’ అంటూ తనదైన శైలిలో రిప్లై ఇచ్చారు. సుమారు 40 గంటల నిరంతర ఆపరేషన్‌లో రోవెన్ ఓడను రక్షించడం ద్వారా వాణిజ్య నౌకలను హైజాక్ చేయాలనే సోమాలి సముద్రపు దొంగల ప్రణాళికలను భారత నావికాదళం విఫలం చేసింది. INS కోల్‌కతా, గత 40 గంటల్లో, సమన్వయ చర్యల ద్వారా మొత్తం 17 మందిని సురక్షితంగా సురక్షితంగా రక్షించినట్లు భారత నావికాదళం X లో పోస్ట్ చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version