National

PM Modi: భారీ వర్షంలో రైతులతో ప్రధాని మోదీ భేటీ.. సింప్లిసిటీ చూస్తే వావ్ అనాల్సిందే.. ప్రొటోకాల్‌ను పక్కనపెట్టి..

Published

on

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం 109 రకాల కొత్త వంగడాలను విడుదల చేశారు. వ్యవసాయ ఉత్పాదకతతో పాటు రైతుల ఆదాయాన్ని పెంపొందించే లక్ష్యంతో వీటిని విడుదల చేశారు.

వ్యవసాయ, ఉద్యాన పంటలు అధిక దిగుబడినివ్వడం, ప్రతికూల వాతావరణాన్ని తట్టుకుని నిలబడడమే ధ్యేయంగా వివిధ వంగడాలను విడుదల చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. వీటిని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ అభివృద్ధి చేసింది.

వీటిలో స్వల్పకాలిక పంటలకు సంబంధించినవి 61 రకాల వంగడాలు ఉండగా, 34 ఫీల్డ్ క్రాప్స్, 27 ఉద్యానవన రకాలు ఉన్నాయి. ఢిల్లీ పుసా ఇన్‌స్టిట్యూట్‌లో ఈ కొత్త వంగడాలను ఆవిష్కరించారు నరేంద్ర మోదీ. ఆ తర్వాత రైతులు, శాస్త్రవేత్తలతో చర్చించారు. దేశంలో ప్రకృతి సేద్యాన్ని పెంపొందించడం, ఆర్గానిక్ ఆహారాన్ని అధికంగా తీసుకునేలా ప్రజలను ప్రోత్సహించాలని మోదీ అన్నారు.

రైతుల ఆదాయం రెట్టింపు చేయడమే తమ లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. వ్యవసాయంలో పరిశోధన, ఆవిష్కరణలపై దృష్టిసారించాలని సూచించారు. అన్నదాతలకు ఎంతో లాభాన్ని సమకూర్చే 109 రకాల వంగడాలను ప్రధాని మోదీ ఆదివారం విడుదల చేశారు. ఢిల్లీలోని ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌ (ICAR) లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ వ్యవసాయ శాస్త్రవేత్తలు, రైతులతో భేటీ అయ్యారు. మోదీ మాట్లాడుతూ.. రైతుల ఆదాయం రెట్టింపు చేయడమే లక్ష్యంగా 109 రకాల పంటల వంగడాలను విడుదల చేసినట్లు తెలిపారు. వ్యవసాయ ఉత్పాదకత, రైతుల ఆదాయాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ఈ సరికొత్త విత్తనాలను విడుదల చేసినట్లు తెలిపారు. వ్యవసాయంలో పరిశోధన, ఆవిష్కరణలపై తన ప్రాధాన్యతను ప్రధాని మోదీ నొక్కి చెప్పారు. లాల్ బహదూర్ శాస్త్రి నినాదం “జై జవాన్, జై కిసాన్”.. తోపాటు అటల్ వాజ్‌పేయ్ నినాదం “జై విజ్ఞాన్” అనే నినాదాన్ని ఆయన గుర్తు చేశారు. పరిశోధన, ఆవిష్కరణలకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ.. ఈ పదబంధానికి “జై అనుసంధన్” కూడా జోడించాలని సూచించారు. కాగా.. రైతులతో మాట్లాడుతున్న క్రమంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.

ప్రొటోకాల్ ను పక్కనబెట్టి..
కాగా.. రైతులతో మాట్లాడుతున్న క్రమంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. పూసా ఇవెంట్‌లో రైతులతో మాట్లాడేందుకు ప్రధాని వెళ్లినప్పుడు, భారీ వర్షం కురిసింది. ఇంటరాక్షన్‌ను రద్దు చేయాలని అధికారులు ప్రధానిని కోరారు.. అయితే వర్షం ఉన్నప్పటికీ రైతులతో సంభాషిస్తానని ప్రధాని పట్టుబట్టారు. ఇక.. గొడుగు పట్టుకునే విషయానికి వస్తే.. ప్రధాని తన గొడుగును తానే పట్టుకుంటానని సెక్యూరిటీకి చెప్పారు. అంతేకాకుండా రైతులకు కూడా గొడుగు పట్టేందుకు ప్రధాని మోదీ ముందుకొచ్చారు. కఠినమైన ప్రొటోకాల్ ఉన్నప్పటికీ.. ప్రధాని మోదీ రైతులతో ఇలా ఇంటరాక్ట్ అవ్వడం పట్ల పలువురు ఆయన సింప్లిసిటీని అభినందిస్తున్నారు.

Advertisement


వ్యవసాయ, ఉద్యానవన పంటల్లో అధిక దిగుబడినిచ్చే, రకరకాల వాతావరణల పరిస్థితిని తట్టుకునేలా ఈ బయోఫోర్డిఫైడ్ విత్తనాలను తయారు చేశారు. 109 రకాల వంగడాలలో 61 పంటల్లో 34 క్షేత్ర పంటలు, 27 ఉద్యాన పంటలు ఉన్నాయి. ఈ విత్తనాల్లో.. పొలాల్లో పండే పంటల విషయానికొస్తే.. మినుము, నూనెగింజలు, చిక్కుడు, చెరకు, పత్తి సహా ఇతర పంటలు ఉన్నాయి. అలాగే ఉద్యాన పంటల విషయానికొస్తే, వివిధ రకాల పండ్లు, కూరగాయలు, సుగంధ ద్రవ్యాలు, పువ్వులు, ఔషధ పంటలు ఉన్నాయి. ఈ సందర్భంగా ప్రధాని మోదీ రైతులతో పాటు శాస్త్రవేత్తలతో మాట్లాడారు.

పోషకాహార లోపం లేని భారతదేశాన్ని రూపొందించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మధ్యాహ్న భోజనం, అంగన్‌వాడీల వంటి అనేక ప్రభుత్వ కార్యక్రమాలతో అనుసంధానం చేయడం ద్వారా బయో ఫోర్టిఫైడ్ రకాల పంటలను ప్రోత్సహించడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టిసారించింది. చిరుధాన్యాల ప్రాముఖ్యతను ఈ సందర్భంగా మోదీ వివరించారు. సేంద్రియ వ్యవసాయానికి ప్రస్తుతం డిమాండ్‌ పెరిగిందని, ప్రజలు అటువంటి ఆహారాన్ని ఇష్టపడుతున్నారని వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version