National

PM Modi: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. అమల్లోకి వచ్చిన సీఏఏ చట్టం

Published

on

దేశంలో పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) అమలు చేసేందుకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో ఇప్పుడు దేశంలో సీఏఏ అమల్లోకి వచ్చింది. CAA అమలు తర్వాత, ఇప్పుడు 31 డిసెంబర్ 2014న లేదా అంతకు ముందు బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నుండి దేశంలో పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) అమలు చేసేందుకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో ఇప్పుడు దేశంలో సీఏఏ అమల్లోకి వచ్చింది. CAA అమలు తర్వాత, ఇప్పుడు 31 డిసెంబర్ 2014న లేదా అంతకు ముందు బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నుండి భారతదేశంలోకి ప్రవేశించిన హిందువులు, జైనులు, క్రిస్టియన్లు, సిక్కులు, బౌద్ధులు, పార్సీలు ఐదేళ్లపాటు ఇక్కడ నివసించిన తర్వాత భారత పౌరసత్వం పొందుతారు. ఆరు కమ్యూనిటీలకు భారత ప్రభుత్వ పౌరసత్వం లభించనుంది.

CAA డిసెంబర్ 2019లో ఆమోదించబడింది. తరువాత దానికి రాష్ట్రపతి ఆమోదం లభించింది. అయితే దీనికి వ్యతిరేకంగా దేశంలోని అనేక ప్రాంతాల్లో నిరసనలు ప్రారంభమయ్యాయి. ఈ చట్టం ఇప్పటి వరకు అమలు చేయలేదు. ఎందుకంటే దీని అమలుకు సంబంధించిన నియమాలు ఇంకా అమల్లోకి రాలేదు.

డిసెంబర్ 11, 2019న రాజ్యసభ CAAని ఆమోదించిన తర్వాత రాష్ట్రంలో భారీ నిరసనలు జరిగాయి. ఆందోళనకారులు భద్రతా దళాలతో ఘర్షణ పడ్డారు. అనేక పట్టణాలు, నగరాల్లో కర్ఫ్యూ విధించే పరిస్థితి వచ్చింది. లోక్‌సభ ఎన్నికలకు ముందే సీఏఏ నిబంధనలను నోటిఫై చేసి అమలు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా గతంలో ప్రకటించారు.

CAA అమలు తర్వాత టీఎంసీ సహా అనేక ప్రతిపక్ష పార్టీలు, సంస్థలు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించాయి. నిరసన తెలుపుతామని హెచ్చరించాయి. ప్రజల పట్ల వివక్ష చూపే దేనినైనా తాను వ్యతిరేకిస్తానని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. మరోవైపు, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్లలో ముస్లింలు మెజారిటీగా ఉండగా, హిందువులు, ఇతర కులాలు మైనారిటీలుగా ఉన్నారని ప్రభుత్వం తెలిపింది.

ఈశాన్య రాష్ట్రాలతోపాటు పలు రాష్ట్రాల్లో నిరసనలు

Advertisement

నిజానికి 2019లో CAA చట్టానికి పార్లమెంటు నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చినప్పుడు ఈశాన్య రాష్ట్రాలతో సహా అనేక రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందని, అందుకే ముస్లింలను ఇందులో చేర్చలేదని ఆందోళనకారులు తెలిపారు. అనేక రాష్ట్రాల్లో నిరసనల దృష్ట్యా, ప్రభుత్వం ఆ సమయంలో CAA ని నిలిపివేసింది. అయితే ఈ అంశంపై ఎప్పటికప్పుడు చర్చలు జరుగుతూనే ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version