International

తల్లిదండ్రులూ.. మీ పిల్లలు జాగ్రత్త..! సోషల్ మీడియా వినియోగంపై ఎలాన్ మస్క్ హెచ్చరిక

Published

on

Elon Musk : సోషల్ మీడియా.. ఇప్పుడిది జీవితాల్లో భాగం.. కాదు కాదు.. ఇదే జీవితం.. పొద్దున లేచింది మొదలు.. తిన్నామా, తాగామా, బాధగా ఉన్నామా, సంతోష పడుతున్నామా.. ఇలా ప్రతీ విషయాన్ని ఫేస్ బుక్ లో పంచుకోకుండా ఉండలేము. ఇలా సోషల్ మీడియా మన జీవితాలను ఆక్రమించేసింది. అవి లేకుండా క్షణం కూడా గడపలేని బలహీనులను చేసింది.

వేటికైనా ఇట్టే ఆకర్షితులయ్యే చిన్నారుల పరిస్థితి ఏంటి?
విచక్షణా జ్ఞానంతో మంచి చెడు తేడా గ్రహించగల స్వీయ నియంత్రణ పాటించగల పరిస్థితుల్లో ఉన్న మనమే.. ఇలా మారిపోయాం అంటే.. ఇక వేటికైనా ఇట్టే ఆకర్షితులయ్యే చిన్నారుల పరిస్థితి ఏంటి? పిల్లల జీవితాలను సోషల్ మీడియా ఎలా ప్రభావితం చేస్తోంది? కాలక్షేపానికి ఉపయోగించాల్సిన
సామాజిక మాధ్యమాలు పిల్లలకు వ్యసనంగా మారకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

గేమ్స్ కి బానిసలైపోయేలా యాప్స్ డిజైన్..
కొన్ని ఆన్ లైన్ గేమ్స్ ఎంత ప్రమాదకరమైనవి అంటే.. ఓ స్టేజ్ తర్వాత కొందరు ఆ గేమ్ లో పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోతారు. ఓ రకంగా ఆ గేమ్ కి బానిసలైపోతారు. అక్కడ ఇన్ స్ట్రక్షన్ లో ఏముంటే అవి గుడ్డిగా చేస్తూ పోతారు. తప్పా? ఒప్పా? అన్న ఆలోచన ఉండదు. మంచి చెడు గుర్తించలేరు.
చివరకు ఆ గేమ్ మాయలో పడి కొందరు బలవన్మరణాలకు పాల్పడుతుంటారు. ఎందుకుంటే, ఆ గేమ్స్ లో అలా పిల్లలు, పెద్దలు అన్న తేడా లేకుండా అందరినీ అట్రాక్ట్ చేసే జిమ్మిక్కులు ఉంటాయి.

ఒక్కసారి చిక్కుకుంటే ఇక బయటపడటం అసాధ్యం..
ఒక్కసారి వాటిలో చిక్కుకుంటే ఇక బయటపడటం అసాధ్యం. సోషల్ మీడియా కూడా ఇలాంటిదేనన్నది ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ హెచ్చరిక.. కొన్ని గేమ్స్ తో ప్రమాదరకం కాకపోయినప్పటికీ.. సోషల్ మీడియాకు అంతకంతకు అలవాటు పడే ఏఐ ఆల్గారిథమ్స్ ఉంటాయని, కాబట్టి తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని ఆయన హెచ్చరిస్తున్నారు. పిల్లల మానసిక వైద్యులు కూడా ఇవే సూచనలు చేస్తున్నారు.

పిల్లల సోషల్ మీడియా వినియోగంపై తల్లిదండ్రులకు ఎలాన్ మస్క్ కీలక సూచనలు..
* పిల్లల సోషల్ మీడియా వినియోగంపై ఎలాన్ మస్క్ హెచ్చరిక
* పిల్లలు ఎక్కువగా సోషల్ మీడియా వినియోగిస్తే హాని కలుగుతుందని వార్నింగ్
* పిల్లలు ఎక్కువసేపు ఎంగేజ్ అయ్యేలా సోషల్ మీడియా యాప్స్ ను డిజైన్ చేస్తున్నారని ఆరోపణ
* పిల్లలను తల్లిదండ్రులు కనిపెడుతూ ఉండాలన్న మస్క్
* పిల్లల సోషల్ మీడియా వినియోగానికి పరిమితి పెట్టాలని సూచన
* సోషల్ మీడియాలో చిక్కుకుపోతున్న యూజర్లు
* ఫేస్ బుక్, వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్ లేకుండా ఉండలేని స్థితి
* బలహీనత, వ్యసనంగా మారిన సోషల్ మీడియా వినియోగం
* చిన్నతనం నుంచే ఫోన్ ఆపరేట్ చేస్తున్న పిల్లలు
* సోషల్ మీడియా వినియోగంతో తగ్గిపోతున్న పిల్లల ఆలోచనాశక్తి
* జాగ్రత్త పడకపోతే ముప్పు తప్పదని నిపుణుల హెచ్చరిక

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version