International
పన్నూ హత్య కుట్ర కేసు- నిఖిల్ గుప్తాను అమెరికాకు అప్పగించిన చెక్ రిపబ్లిక్
Gurpatwant Pannun Murder Plot : ఖలిస్థానీ వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర కేసులో అరెస్టయి చెక్ రిపబ్లిక్ జైలులో ఉన్న భారతీయుడు నిఖిల్ గుప్తాను అమెరికాకు అప్పగించినట్లు తెలుస్తోంది. అక్కడి కాలమానం ప్రకారం సోమవారం ఆయన్ను న్యూయార్క్ ఫెడరల్ కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు వాషింగ్టన్ పోస్ట్ సహా పలు మీడియా కథనాలు వెల్లడించాయి.
భారత ప్రభుత్వ ఉద్యోగితో కలిసి పన్నూను హత్య చేసేందుకు నిఖిల్ సుపారీ ఇచ్చారని అమెరికా ఆరోపించింది. అమెరికా సూచనల మేరకే గుప్తాను అరెస్టు చేసినట్లు చెక్ రిపబ్లిక్ అధికారులు వెల్లడించారు. వ్యాపార, విహార యాత్ర కోసం చెక్ రిపబ్లిక్ వెళ్లిన నిఖిల్ గుప్తాను గతేడాది జూన్ 30న అక్కడి విమానాశ్రయంలో అరెస్టు చేశారు. త్వరలో అమెరికా జాతీయ భద్రతా సలహాదారు(NSA) జేక్ సలీవన్ భారత పర్యటన నేపథ్యంలోనే ఇది ప్రాధాన్యం సంతరించుకుంది. భారత ఎన్ఎస్ఏ అజిత్ డొభాల్‌తో ఆయన భేటీ కానున్నారు.