Hashtag

Operation Garuda: పెద్దపల్లిలో “ఆపరేషన్ గరుడ..” డ్రోన్ లతో పెట్రోలింగ్ ప్రారంభం

Published

on

Operation Garuda: రామగుండం Ramagundam పోలీస్ కమీషనరేట్ Police Commissionerate పరిధిలో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు పోలీసులు. ఆపరేషన్ గరుడ పేరుతో డ్రోన్ Drone లతో పెట్రోలింగ్ ప్రారంభించారు. పెద్దపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో సిపి ఎం.శ్రీనివాస్ ఆపరేషన్ గరుడ పేరుతో డ్రోన్ పెట్రోలింగ్ Patrolling ను ప్రారంభించి దశలవారీగా కమీషనరేట్ వ్యాప్తంగా అమలు చేస్తామని ప్రకటించారు.

నేరాల నియంత్రణే ప్రధాన లక్ష్యం
అసాంఘీక శక్తుల నిర్మూలనకు, నేరాల నియంత్రణ, ప్రజల భద్రత, లా అండ్ ఆర్డర్ దృష్ట్యా ప్రయోగాత్మకంగా పెద్దపల్లిలో ఆపరేషన్‌ గరుడ సేవలు మొదలు పెట్టామని సిపి ఎం. శ్రీనివాస్‌ తెలిపారు.

విధినిర్వహణలో కొన్ని సందర్బాలలో ప్రత్యేక నిఘా పెట్టడం ఇబ్బందిగా ఉన్న నేపథ్యంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని డ్రోన్ ద్వారా ఏరియల్ సర్వే చేయాలనే ఉద్దేశ్యంతో “ఆపరేషన్ గరుడ” కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు.

ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక పట్టణాన్ని తక్కువ సమయంలో పూర్తి స్థాయిలో డ్రోన్ ద్వారా పర్యవేక్షించడం సాధ్యం అవుతుందని తెలిపారు. ఎవరైనా గొడవలకు దిగినా చట్టవ్యతిరేకమైన చర్యలకు పాల్పడిన వీడియోలు, ఫోటోల ఆధారాలతో కేసులు నమోదు చేసి చట్ట ప్రకారం చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. పెద్దపల్లిలో మొదలైన ఆపరేషన్‌ గరుడ డ్రోన్‌ పెట్రోలింగ్ భవిష్యత్తులో కమిషనరేట్‌ వ్యాప్తంగా అమలు చేస్తామన్నారు.

డ్రోన్ ఆపరేషన్ కు లీడ్ బ్యాంక్ చేయుత
ప్రజల భద్రత, నేరాల నియంత్రణలో భాగంగా పోలీసులు చేస్తున్న కృషికి తమ వంతు సహాయంగా లీడ్ బ్యాంకు జిల్లా మేనేజర్ చెగొండ వెంకటేష్ ఆర్థిక సహాయం అందజేశారు.‌ ఆపరేషన్ గరుడ కోసం ఉపయోగించే డ్రోన్ ల కొనుగోలుకు కావాల్సిన ఆర్థికంగా సహాయం అందించడానికి లీడ్ బ్యాంక్ మేనేజర్ ముందుకు రావడంతో పోలీసులతో పాటు పట్టణ ప్రముఖులు అభినందించారు.

Advertisement

ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి.రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్రరావు, పెద్దపల్లి ఏసిపి కృష్ణ , సీఐ కృష్ణ, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ పాల్గొన్నారు.

(రిపోర్టింగ్ కేవీ.రెడ్డి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version