Business

Okaya EV Ferrato: కొత్త బ్రాండ్‌తో ఈవీ స్కూటర్‌ ప్రకటించిన ఒకాయా.. ఓలా, టీవీఎస్‌ ఐక్యూబ్‌కు గట్టి పోటీ ఖాయం

Published

on

ప్రపంచవ్యాప్తంగా ఈవీ వాహనాల హవా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు అన్ని కంపెనీలు సరికొత్త ఎలక్ట్రిక్‌ వాహనాలను మార్కెట్‌లో రిలీజ్‌ చేస్తున్నాయి. తాజాగా ఒకాయ ఈవీ తన కొత్త ప్రీమియం బ్రాండ్ అయిన ఫెర్రాటోను భారత మార్కెట్లో విడుదల చేయడానికి సిద్ధంగా ఉందని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. గతంలోనే పలు నివేదికల ప్రకారం ఫెర్రాటో తన మొదటి ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్‌ 2024-25 ఆర్థిక సంవత్సరంలో విడుదల చేయనుందని వెల్లడించాయి. అందుకు తగ్గట్టుగానే ఫెర్రాటో కొత్త ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్‌ ‘డిస్రిఫ్టర్’ పేరుతో లాంచ్‌ చేస్తుంది. ఇది 228 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేసేలా 6.4 కేడబ్ల్యూ పీఎంఎస్‌ఎం మోటార్‌ వస్తుంది. ఈ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్‌కు సంబంధించి గరిష్ట వేగం గంటకు 95 కిమీగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఫెర్రాటో ఈవీ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

ఫెర్రాటో రాబోయే రోజుల్లో తన ఈవీ స్కూటర్‌ గురించి మరిన్ని టీజర్లను విడుదల చేసే అవకాశం ఉంది. ఫెర్రాటోకు సంబంధించిన డీలర్‌షిప్ నెట్‌వర్క్ ఇప్పటికే ఒకాయా ఈవీ ద్వారా ప్రకటించాఉ. ఒకాయా ఈవీ కంటే సేవా నాణ్యతను మెరుగుపరిచే లక్ష్యంతో ఫెర్రాటో కోసం 100 కంటే ఎక్కువ డీలర్‌ షిప్లను ఏర్పాటు చేయాలని బ్రాండ్ యోచిస్తోంది. ఫెర్రాటోతో, వినియోగదారులకు ప్రీమియం అనుభవాన్ని అందించడమే ఒకాయా ఈవీ ప్రధాన లక్ష్యమని ఒకాయ ఎలక్ట్రిక్ వెహికల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ అన్షుల్ గుప్తా ఇలా అన్నారు. స్థిరమైన మొబిలిటీ ల్యాండ్ స్కేప్లో తమ మార్క్‌ చూపడమే లక్ష్యంగా పని చేస్తామని వివరించారు. అమ్మకాలు, కస్టమర్ కార్యకలాపాలు, సేవా కేంద్రాలను పర్యవేక్షిస్తున్న ప్రత్యేక బృందంతో ఫెర్రాటో కోసం 100 ప్లస్‌ భాగస్వాములను ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తున్నామని వివరించారు.

ఫెర్రాటో బ్రాండ్‌ లైనప్‌ను ప్రారంభించిన తాజా స్కూటర్ మోటోఫాస్ట్‌ లాంచ్‌ చేయనుంది. ముఖ్యంగా మార్కెట్‌ను ఏలుతున్న ఓలా, టీవీఎస్‌ ఐక్యూబ్‌ స్కూటర్లకు గట్టి పోటినిచ్చేలా దీన్ని రూపొందించారు. ఈ స్కూటర్‌ ధర రూ.1,36,999 ఎక్స్-షోరూమ్గా ఉంటుంది. ఎలక్ట్రిక్ మోటార్ 2300 వాట్స​ గరిష్ట శక్తిని ఉత్పత్తి చేస్తుంది. స్కూటర్ గరిష్టంగా 70 కేఎంపీహెచ్‌ వేగాన్ని అందుకుంటుంది. ఈ స్కూటర్లు మూడు రైడింగ్ మోడ్లు ఉన్నాయి. ఎకో, సిటీ, స్పోర్ట్స్ రైడింగ్‌ మోడ్స్‌ ఈ స్కూటర్‌ ప్రత్యేకత. మోటోఫాస్ట్‌ 3.53 కేడబ్ల్యూహెచ్‌ సామర్థ్యంతో డ్యూయల్ బ్యాటరీ వ్యవస్థతో వస్తుంది. అలాగే ఈ స్కూటర్‌ ఎల్‌ఎఫ్‌పీ సాంకేతికతను ఉపయోగిస్తోంది. బ్యాటరీ ప్యాక్ పూర్తిగా ఛార్జ్ కావడానికి 4 నుంచి 5 గంటలు పడుతుంది. ఈ స్కూటర్‌ 110 కిమీ నుంచి 130 కిమీ మధ్య రైడింగ్ పరిధిని అందిస్తుందని కంపెనీ క్లెయిమ్‌ చేస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version