Andhrapradesh

ఎలాంటి డ్రైవింగ్ టెస్ట్ లేకుండానే లైసెన్స్ జారీ.. జూన్ 1 నుంచి కొత్త రూల్స్..

Published

on

చదువుకునే విద్యార్థి దగ్గర నుంచి ఉద్యోగం చేసే వ్యక్తి వరకు టూ వీలర్ అనేది మినిమమ్ అవసరంగా మారింది. ప్రతీ ఇంట్లో ఒక టూవీలర్ లేదా ఏదో ఒక వాహనం అనేది ఉంటుంది. రవాణా శాఖ నియమ నిబంధనల ప్రకారం ఏ వాహనం నడపాలన్నా ప్రతీ ఒక్కరికీ డ్రైవింగ్ లైసెన్స్ అనేది తప్పనిసరిగా ఉండాలి.
అయితే దానిని తీసుకోవాలంటే.. ముందుగా స్లాట్ బుకింగ్, డ్రైవింగ్ టెస్ట్, బయో మెట్రిక్ తదితర అంశాల కోసం ఆర్టీఓ ఆఫీసు చుట్టూ నాలుగైదుసార్లు తిరిగితే గానీ డ్రైవింగ్ లైసెన్స్ అందుకోలేరు. కానీ, ఈ సమస్యలకు చెక్ పెడుతూ కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. జూన్ ఒకటో తేదీ నుంచి కొత్త రూల్స్ అమల్లోకి వస్తున్నాయి
దీని ప్రకారం ఆర్టీఓ ఆఫీసుల చుట్టూ ప్రదక్షిణ చేయనక్కర్లేదు. స్లాట్ బుకింగ్.. డ్రైవింగ్ టెస్ట్ అవసరం లేదు. ఎటువంటి టెస్టుల్లేకుండానే తేలిగ్గానే డ్రైవింగ్ లైసెన్స్ పొందొచ్చు. ఈ కొత్త నిబంధనల్లో గుర్తింపు పొందిన ఇనిస్టిట్యూట్ నిర్వహించే టెస్ట్ ఉత్తీర్ణులైతే చాలు.
ఇనిస్టిట్యూట్ లో అర్హత సాధించిన వారికి మాత్రమే లైసెన్స్ లభ్యమవుతుంది. దీని వల్ల ఆర్టీఓ కార్యాలయం చుట్టూ తిరుగుతూ.. క్యూలో నిల్చోవాల్సిన అవసరం ఉండదు. కేంద్ర, రాష్ట్ర రోడ్డు రవాణా శాఖలు డ్రైవింగ్ ఇనిస్టిట్యూట్‌లు ప్రారంభిస్తున్నాయి. డ్రైవింగ్ లైసెన్స్ కావాలని దరఖాస్తు చేసుకునే వారు గుర్తింపు పొందిన డ్రైవింగ్ ఇనిస్టిట్యూట్ కేంద్రాల్లో రిజిస్టర్ చేసుకోవాలి.
ఆ సంస్థ నిర్వహించే పరీక్ష పాస్ అవ్వాల్సింటుంది. ఆ తర్వాత వాళ్లు మీరు డ్రైవింగ్ టెస్ట్ పాస్ అయినట్లు ఓ సర్టిఫికెట్ ను జారీ చేస్తారు. ఆ తర్వాత ఆ సర్టిఫికేట్ ఆధారంగా.. ఆర్టీఓ కార్యాలయంలో లైసెన్స్ కు దరఖాస్తు చేసుకోవచ్చు. డ్రైవింగ్ శిక్షణ ఇచ్చే వారు కూడా హైస్కూల్ విద్య పూర్తి చేసుకోవడంతోపాటు డ్రైవింగ్‌లో ఐదేండ్ల అనుభవంతోపాటు బయో మెట్రిక్ టెక్నాలజీపై అవగాహన ఉండాలి.
ఇక ఆ తరువాత ఆర్టీవో నుంచి ఏ విధమైన టెస్టింగ్ లేకుండా డ్రైవింగ్ లైసెన్స్ జారీ అవుతుంది. ఈ డ్రైవింగ్ కోర్సు లైట్ మోటార్ వెహికల్ కోసం అందించనున్నారు. లైట్ వెహికల్ డ్రైవింగ్ శిక్షణ నాలుగు వారాలు గానీ, కనీసం 29 గంటల శిక్షణ గానీ ఉండాలి.

ఇందులో 21 గంటలు ప్రాక్టికల్, ఎనిమిది గంటలు థియరీ ఉండాలి. హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఆరు వారాలు, 39 గంటల శిక్షణ అవసరం. 31 గంటల పాటు ప్రాక్టికల్, మిగతా ఎనిమిది గంటలు థియరీ ఉంటుంది. దీని కంటే ముందుగా ఆర్టీఓ ఆఫీస్ లో లెర్నింగ్ లైసెన్స్ తీసుకున్న తర్వాత ఈ ప్రక్రియ చేపట్టాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version