Andhrapradesh

ఏపీలో కొత్తగా అక్కడ రైల్వే స్టేషన్ రెడీ.. ఈ రూట్‌లో పట్టాలెక్కనున్న రైళ్లు, ఎన్నో ఏళ్ల కల నెరవేరబోతోంది

Published

on

ఏపీలో కొత్త రైల్వే లైన్‌ల పనులు ఊపందుకున్నాయి.. ఈ పనుల్ని త్వరగా పూర్తి చేసి రైళ్లు పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో నడికుడి- శ్రీకాళహస్తి కొత్త రైల్వేలైన్‌ పనులు మరింత వేగవంతం చేశారు. ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో పనుల్లో స్పీడ్ పెంచారు. దర్శి, పొదిలి, కనిగిరి వైపు పనులు ముగింపు దశకు వస్తున్నాయి. ఈ పనుల్ని త్వరగా పూర్తి చేసి ఈ ఏడాది చివరికి నాటికి దర్శికి రైళ్లు నడుపుతామంటున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రైల్వే లైన్ల పనులు వేగవంతం అయ్యాయి.. ముఖ్యంగా నడికుడి- శ్రీకాళహస్తి రైల్వేలైన్‌ పనులపై ఫోకస్ పెట్టారు అధికారులు. ముఖ్యంగా ప్రకాశం జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో రైల్వే లైన్ పనుల్లో స్పీడ్ పెంచారు. ముఖ్యంగా దర్శి రైల్వే స్టేషన్‌ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ రైల్వే లైన్‌లో మెయిన్ ట్రాక్‌ పూర్తి చేశారు.. లూప్‌లైన్, మూడు ట్రాక్‌ల పనులు చేపట్టారు. ఈ పనుల్ని పూర్తి చేసి ఈ ఏడాది చివరి నాటికి పూర్తిస్థాయిలో రైలు ప్రయాణం ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని చెబుతున్నారు అధికారులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version