International

‘నేనే ప్రెసిడెంట్​ క్యాండిడేట్​- ఇక డ్రామాలు ఆపండి’- సొంత పార్టీ నేతలకు బైడెన్ లేఖ

Published

on

Biden Letter To Congressional Democrats : డెమొక్రటిక్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష అభ్యర్థిని తానే అని జో బైడెన్ పునరుద్ఘాటించారు. తన అభ్యర్థిత్వంపై పార్టీలో అంతర్గత డ్రామా కట్టిపెట్టాలంటూ డెమొక్రటిక్ కాంగ్రెస్ సభ్యులకు రాసిన రెండు పేజీల లేఖలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘డెమొక్రటిక్ కన్వెన్షన్​కు 42రోజులు, యూఎస్ జనరల్ ఎలెక్షన్స్​కు​ 119రోజుల సమయం ఉంది. మనం తీసుకున్న సంకల్పం బలహీనపడటం, ముందున్న పనిపై స్పష్టత లేకపోవడం ట్రంప్​నకు మాత్రమే సహాయపడుతుంది. అది మనను బాధపెడుతుంది. మనందరం ఏకతాటిపైకి వచ్చి, పార్టీగా కలిసికట్టుగా ముందుకు సాగుతూ ట్రంప్​ను ఓడించడానికి సమయం ఆసన్నమైంది’ అని బైడెన్ అన్నారు.

కొంతకాలంగా బైడెన్ అభ్యర్థిత్వంపై సొంత పార్టీలోనే అసహనం కనిపిస్తోంది. ఇటీవల ట్రంప్​తో జరిగిన డిబేట్​ తర్వాత బైడెన్ తన అభ్యర్థిత్వం వదులుకోవాలని డెమొక్రటిక్ నేతలు డిమాండ్​ చేస్తున్నారు. అదే సమయంలో కొంత మంది బైడెన్ మద్దతుదారులు, ట్రంప్​ను ఓడించడానికి ఇంతకంటే మంచివారు ఉండరంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version