National

దేశ వ్యాప్తంగా ప్రసిద్ధ మహిమాన్వితమైన రామయ్య ఆలయాలు.. ఎక్కడ ఉన్నాయంటే

Published

on

రామ జన్మ భూమి అయోధ్యలోని రామ మందిరం అత్యంత సుందరంగా చరిత్రలో నిలిచిపోయే విధంగా నిర్మాణం జరుపుకుంది. రామయ్య అందరి వాడు.. ప్రతి ఇంట్లో రామయ్య ఓ పెద్ద కొడుకు.. ఢిల్లీ నుంచి గల్లీ వరకూ రామయ్యను పూజిస్తారు. శ్రీ రామ నవమి వేడుకలను అత్యంత ఘనంగా జరుపుతారు. అయితే అయోధ్యకు మించిన అద్భుతమైన రామాలయాలు దేశంలో అనేక ప్రాంతాల్లో ఉన్నాయి. భారతీయుల మనస్సులలో చిరకాలంగా నిలిచి పోయిన అయోధ్యలోని ఐకానిక్ రామమందిరంపై అందరి దృష్టి ఉంది. అయోధ్యలోని కొత్త రామమందిరంలో ఇప్పుడు తొలిసారిగా శ్రీ రామ నవమి వేడుకలను నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో అయోధ్యలో రామ మందిరం కాకుండా శ్రీరామునికి సంబంధించిన మహా మహినిత్వ ఆలయాలున్నాయి. అవి ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాం.

రామరాజ ఆలయం: ఈ ఆలయం మధ్యప్రదేశ్‌లోని ఓర్చాలోని బెత్వా నది తీరంలో ఉంది. దేవాలయం వెనుక ఉన్న పురాణ కథ ఏమిటంటే ఓర్చా రాణి శ్రీరాముని భక్తురాలు. అయోధ్య సందర్శన సమయంలో ఓర్చా రాణి బాలుడి రూపంలోని శ్రీరాముడిని తనతో పాటు.. తీసుకుని వస్తూ ఇతర ప్రాంతాలకు వెళ్లకూడదనే షరతు విధించింది. ఓర్చాతో వచ్చిన రామయ్య మొదట అడుగు పెట్టాడో అక్కడే ఆలయాన్ని నిర్మించారు.

సీతా రామచంద్రస్వామి ఆలయం: దక్షిణ అయోధ్యగా ఖ్యాతిగాంచిన రామాయలం తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలంలో ఉంది. ది భారతదేశంలోని ప్రసిద్ధ రామమందిరాలలో ఒకటి. శ్రీ రామ నవమి రోజున సీతారాముల వివాహ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుతారు. ఈ ఆలయాన్ని భద్రాచలం దేవాలయం అని కూడా అంటారు. రామాయణంతో భద్రాచలం, విజయనగరం అనే రెండు ప్రదేశాలకు దగ్గరి సంబంధం ఉంది. రాముడు, సీత, లక్ష్మణులు భద్రాచలం నుంచి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న పర్ణశాలలో బస చేసినట్లు చెబుతారు.

రామస్వామి దేవాలయం: తమిళనాడు ఈ దేవాలయం శ్రీమహావిష్ణువు అవతారమైన రాముడికి అంకితం చేయబడింది. తమిళనాడులోని కుంభకోణంలో ఉంది. ఈ ఆలయాన్ని 400 సంవత్సరాల క్రితం రాజు రఘునాథ్ నాయక్ నిర్మించారు. ఈ ఆలయం రామాయణంలోని దృశ్యాలను వర్ణిస్తుంది. ఆలయ స్తంభాలు అందమైన శిల్పాలతో నిండి ఉంది. సీతారాములు కల్యాణ భంగిమలో గర్భగుడిలో కూర్చుని భక్తులతో పూజలను అందుకుంటున్నారు.

కాల రామ ఆలయం: మహారాష్ట్రలోని నాసిక నగరంలోని పంచవటి ప్రాంతంలో ఉన్న మహా మహిమానిత్వ ఆలయం. రాముడు వనవాస సమయంలో నివసించిన ప్రదేశంలో ఈ ఆలయం ఉంది. 1782లో పాత చెక్క దేవాలయం ఉన్న స్థలంలో సర్దార్ రంగారావు ఒదేకర్ పునర్మించారు. ఈ ఆలయ నిర్మాణం సుమారు 12 సంవత్సరాలు కొనసాగింది. రోజుకు సుమారు 2000 మంది పనిచేశారు.

రఘునాథ్ ఆలయం: జమ్మూలో ఉన్న రఘునాథ్ ఆలయం సొంత షికారాలతో ఏడు పుణ్యక్షేత్రాలను కలిగి ఉంది. జమ్మూ నగరంలో ఉన్న ఉత్తర భారతదేశంలోని అతిపెద్ద ఆలయ సముదాయాలలో ఒకటి. మహారాజా గులాబ్ సింగ్, అతని కుమారుడు మహారాజ్ రణబీర్ సింగ్ 1853-1860 మధ్యకాలంలో ఈ ఆలయాన్ని నిర్మించారు.

శ్రీ రామ తీర్థ దేవాలయం: ఈ ఆలయం చోగావాన్ రోడ్‌లో అమృత్‌సర్‌కు పశ్చిమ దిశలో 12 కిమీ దూరంలో ఉంది. వాల్మీకి మహర్షి ఆశ్రమంలో సీతాదేవి ఆశ్రయం పొందిన ప్రదేశం ఇదని విశ్వాసం. అదే ప్రదేశంలో ఆమె లవ, కుశలకు జన్మనిచ్చింది. ఇందులో సీతాదేవి స్నానం చేసిన మెట్ల బావి కూడా ఉంది. అందుకే ఇది భారతదేశంలోని అత్యంత పవిత్రమైన శ్రీరామ దేవాలయాలలో ఒకటిగా ప్రసిద్ధి.

కోదండరామ దేవాలయం: ఈ రామాలయం కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లాలోని హిరేమగళూరులో ఉంది. రామ లక్ష్మణులు విల్లు బాణాలను చేత బూని దర్శనం ఇస్తారు. రాముడి విల్లును కొండన అని పిలుస్తారు. గర్భగుడి లోపల హనుమంతుని పీఠంపై రాముడు, లక్ష్మణుడు, సీత విగ్రహాలుంటాయి.

రామమందిరం: ఒడిషా భువనేశ్వర్‌లోని ఖరావెల్ నగర్ సమీపంలో ఉన్న ఈ రామాలయం నగరం నడిబొడ్డున ఉంది. రామభక్తులకు అత్యంత ప్రసిద్ధ దేవాలయాలలో ఒకటి. ఈ ఆలయంలో రాముడు, లక్ష్మణుడు, సీతాదేవి విగ్రహాలు అందంగా ఉంటాయి. ఇది ఒక ప్రైవేట్ ట్రస్ట్ ద్వారా నిర్మించబడింది. నిర్వహించబడుతుంది. ఆలయ సముదాయంలో హనుమంతుడు, శివుడు సహా ఇతర దేవుళ్లకు అంకితం చేయబడిన అనేక ఆలయాలు ఉన్నాయి.

త్రిప్రయార్ శ్రీరామ దేవాలయం: ఈ ఆలయం కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో ఉంది. ఆలయంలో ఉన్న శ్రీ రాముడిని త్రిప్రయారప్పన్ లేదా త్రిప్రయార్ తేవర్ అని పిలుస్తారు. పురాణాల ప్రకారం ఇక్కడ శ్రీరాముడిని శ్రీకృష్ణుడు పూజించాడని నమ్ముతారు. శ్రీకృష్ణుడు అవతారం చాలించిన అనంతరం రామయ్య విగ్రహాన్ని సముద్రంలో నిమజ్జనం చేశారు. తరువాత ఈ విగ్రహం కేరళలోని చెట్టువా ప్రాంతానికి సమీపంలోని సముద్రంలో కొందరు మత్స్యకారులకు లభించింది. అప్పుడు ఆలయం నిర్మించినట్లు కథనం.

Read also: 🙏Sri Rama Navami 2024: బాలరాముడి నుదుటిని ముద్దాడనున్న సూర్యుడు.. అయోధ్యలో అద్భుత దృశ్యం.. ఈ ఒక్క రోజు మాత్రమే..

https://infoline.one/sri-rama-navami-2024-balaramas-forehead/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version