News

నరేంద్ర మోడీ ఆస్తుల విలువ ఎంతో తెలుసా

Published

on

లోక్సభఎన్నికల్లో భాగంగా ముచ్చటగా మూడోసారి ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసి నియోజకవర్గం నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నామినేషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలోనే ఆయన తన ఆస్తులు, అప్పుల గురించి ఆ నామినేషన్ పత్రాల్లో వెల్లడించారు.
13 ఏళ్లు సీఎంగా.. 10 ఏళ్లు పీఎంగా పనిచేసిన నరేంద్ర మోదీకి సొంత ఇల్లు, కారు లేవని నామపత్రాల్లో తెలిపారు. అంతేకాకుండా తన పేరు మీద ఎలాంటి షేర్లు లేవని స్పష్టం చేశారు. తన మొత్తం ఆస్తుల విలువ రూ.3.02 కోట్లు అని ఎన్నికల సందర్భంగా దాఖలు చేసిన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. దేశంలో ఎన్నికల్లో పోటీ చేసే ప్రతీ అభ్యర్థి ఈ అఫిడవిట్‌ను తప్పనిసరిగా ఎన్నికల కమిషన్‌కు దాఖలు చేయాల్సి ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version