News
నా హృదయం నిండిపోయింది.. కళ్ళు మెరిసిపోయాయి.. రేణు దేశాయ్ ఎమోషనల్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ దంపతుల కుమారుడు అకీరా నందన్ గత రెండు మూడు రోజుల నుంచి వార్తలలో నిలుస్తూ వస్తున్నాడు. దానికి కారణం తన తండ్రి పవన్ కళ్యాణ్ తో కలిసి ప్రధాని మోడీని కలవడమే. మోడీ అకిరాతో కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో రిలీజైనప్పటి నుంచి పెద్ద ఎత్తున ఇదే విషయం మీద చర్చ జరుగుతుంది. తాజాగా అఖిరా నందన్ మోడీతో కలిసి ఉన్న ఒక ఫోటోను షేర్ చేసిన రేణు దేశాయ్ ఎమోషనల్ అయ్యారు. తన భావన అంతా సోషల్ మీడియా వేదికగా ఆమె పంచుకున్నారు. ఒక తల్లిగా నాకు ఎనలేని సంతోషాన్ని ఇచ్చిన సందర్భం కళ్యాణ్ గారితో అకిరా వెళ్లి నరేంద్ర మోడీ గారిని కలిసి వారితో ఫోటో దిగడం.
వ్యక్తిగతంగా నాకు బీజేపీ అలాగే మోడీ గారు అంటే చాలా అభిమానం. అలాంటిది ఈ రోజు ఈ ఫోటో చూస్తుంటే నా మనసు ఉద్వేగానికి గురైంది, నా కళ్ళు ఆనందంతో మెరిసిపోయాయి. నా హృదయం నిండిపోయింది, ఆకీరాని దీవించిన మోడీ గారికి ధన్యవాదాలు. అలాగే అకిరా మీద ఇంత ప్రేమ కురిపిస్తున్న మీ అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు అంటూ ఆమె సోషల్ మీడియాలో రాసుకొచ్చింది. అంతేకాదు ఈ ఫోటో కింద కామెంట్లు పెడుతున్న చాలామందికి ఆమె సమాధానం ఇస్తున్న వైనం కూడా చర్చనీయాంశం అవుతుంది.