Andhrapradesh

Musi River: వివాదంగా మారిన మూసీ బ్యూటిఫికేషన్.. తమ ఇళ్లను కూల్చివేయొద్దంటూ..

Published

on

కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ అభివృద్ధిలో మూసీ నదినే ప్రధాన ఎజెండాగా మార్చుకుంది. మూసీ నదిని ప్రక్షాళనే కాదు, పూర్తిగా సుందరీకరణ చేసి రాష్ట్రానికి చిహ్నాంగా చూపిస్తామని చెబుతోంది. వచ్చే ఐదేళ్లలో 1.5 లక్షల కోట్లు ఖర్చు చేసి మూసీతో హైదరాబాద్‌కు వన్నెతీసుకువస్తామని చెబుతోంది. అయితే మూసీ బ్యూటిఫికేషన్ పేరుతో తమను రోడ్డున పడేస్తున్నారని నది పరివాహక ప్రాంత ప్రజలు ఆరోపిస్తున్నారు.

రూపాయి.. రూపాయి కూడబెట్టి కట్టుకున్న ఇళ్లు వదిలి వెళ్లే ప్రసక్తే లేదని ఆందోళనకు దిగారు. ఎప్పుడు బుల్డోజర్లు తీసుకొచ్చి తమ ఇంటిని కూల్చేస్తారోనని గ్రేట్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడించారు మూసి నది ప్రాంతవాసులు. మూసీ ప్రాంతవాసుల ఆందోళనకు సీపీఎం మద్దతు తెలిపింది. పేదల ఇళ్లు కూల్చేస్తే ఆందోళనలు ఉధృతం చేస్తామని తెలిపారు. దీంతో పోలీసులు అలర్ట్‌ అయి జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం గేట్‌ మూసివేశారు. ఇలా ఆందోళనలు మొదలు కావడంతో మూసీ వెంట ఉన్న ఆస్తుల సేకరణ అంత సులువు కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version