Cricket

MS Dhoni : ఎంఎస్ ధోని చారిత్ర‌క రికార్డు.. ఐపీఎల్‌లో తొలి భార‌తీయుడు..

Published

on

MS Dhoni creates historical record : హిట్‌మ్యాన్ రోహిత్ శ‌ర్మ శ‌త‌కంతో పోరాడినా ముంబై ఇండియ‌న్స్‌కు ఓట‌మి త‌ప్ప‌లేదు. ముంబైలోని వాంఖ‌డే స్టేడియంలో జ‌రిగిన మ్యాచ్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్ 20 ప‌రుగుల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. కాగా.. సీఎస్‌కే స్కోరు 200 దాట‌డంలో ఎంఎస్ ధోని కీల‌క పాత్ర పోషించాడు. అత‌డు కేవ‌లం నాలుగు బంతుల్లో మూడు సిక్స‌ర్లు బాది 20 ప‌రుగుల‌తో అజేయంగా నిలిచాడు.

42 ఏళ్ల వ‌య‌సులోనూ ధోని చెల‌రేగి పోతున్నాడు. ధోని మెరుపుల‌తో వాంఖ‌డే స్టేడియం మొత్తం ద‌ద్ద‌రిల్లిపోయింది. ముంబై ఓట‌మికి ధోని ఆడిన ఇన్నింగ్సే కార‌ణం. ఇన్నింగ్స్ ఆఖ‌రి ఓవ‌ర్‌లో నాలుగు బంతులు మిగిలి ఉండ‌గా బ్యాటింగ్‌కు వ‌చ్చిన ధోని హ్యాట్రిక్ సిక్స‌ర్ల‌తో విరుచుకుప‌డ్డాడు. కాగా.. ధోని చేసిన 20 ప‌రుగులే చెన్నై విజ‌యానికి కార‌ణం అయ్యాయి. ఈ క్ర‌మంలో ధోని 20 ప‌రుగులు చేస్తే.. చెన్నై 20 ర‌న్స్‌తో గెలిచింది అని సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది.

ధోని అరుదైన రికార్డు.. ఒకే ఒక్క‌డు

ఐపీఎల్‌లో ఇన్నింగ్స్‌ను ఆరంభించి హ్యాట్రిక్ సిక్స‌ర్ల‌ను కొట్టిన తొలి భార‌త ఆట‌గాడిగా ధోని చ‌రిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చ‌రిత్ర‌లో ఈ అరుదైన మైలురాయిని సాధించిన మూడో ఆట‌గాడిగా రికార్డుల‌కు ఎక్కాడు. గ‌తంలో సునీల్ న‌రైన్‌, నికోల‌స్ పూర‌న్ లు ఇన్నింగ్స్ ఆరంభి మొద‌టి మూడు బంతుల్లో మూడు సిక్స‌ర్లు బాదారు.

ఐపీఎల్‌లో ఇన్నింగ్స్ ఆరంభి వ‌రుస‌గా మూడు సిక్స‌ర్లు బాదిన ప్లేయ‌ర్లు..
1 – సునీల్ నరైన్ : 12వ ఓవర్‌లో 2021లో KKR vs RCB మ్యాచ్‌లో మూడు సిక్సర్లు
2 – నికోలస్ పూరన్: LSG vs SRH మ్యాచ్‌లో 2023లో 16వ ఓవర్‌లో మూడు సిక్సర్లు
3 – MS ధోని: 20వ ఓవర్‌లో 2024లో CSK vs MI మ్యాచ్‌లో మూడు సిక్సర్లు

Advertisement

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో 4 కోల్పోయి 206 పరుగుల భారీ స్కోరు చేసింది. కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ (69; 40 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స‌ర్లు), శివమ్‌ దూబె (66 నాటౌట్‌; 38 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) దంచికొట్టారు. ధోని (20 నాటౌట్‌; 4 బంతుల్లో 3సిక్స‌ర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ముంబై బౌల‌ర్ల‌లో హార్దిక్‌ రెండు వికెట్లు తీశౄడు.

అనంత‌రం ల‌క్ష్య‌ ఛేదనలో ముంబయి 20 ఓవర్లలో 6 న‌ష్టానికి 186 పరుగులకే ప‌రిమిత‌మైంది. రోహిత్‌ శర్మ (105 నాటౌట్‌; 63 బంతుల్లో 11ఫోర్లు, 5సిక్స‌ర్లు) సెంచ‌రీతో వీరోచిత పోరాటం చేశాడు. సీఎస్‌కే బౌల‌ర్ల‌లో పతిరన నాలుగు వికెట్ల‌తో ముంబయిని గ‌ట్టి దెబ్బకొట్టాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version