Business
MRP అంటే ఏమిటి? అంతకుమించిన ధర అడిగితే ఏం చేయాలి? పూర్తి వివరాలు ఇవి..
మార్కెట్లో మనం కొనుగోలు చేసే ప్రతి వస్తువుకు ఒక ప్రత్యేకమైన ధర ముందే నిర్ణయించి ఉంటుంది. దానినే మాగ్జిమమ్ రిటైల్ ప్రైస్(ఎంఆర్‌పీ) అని అంటారు. విక్రేత ఎవరైనా అంతకుమించిన ధరతో వస్తువులు విక్రయించకూడదు. అవసరమైతే ఆ ధర కన్నా తక్కువకు డిస్కౌంట్ ఇచ్చి విక్రయించుకోవచ్చు గానీ.. అంతకుమించి చేయకూడదు. ఇది కచ్చితమైన నిబంధన. అయితే ఇటీవల కాలంలో అసలు ఈ ఎంఆర్‌పీని ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. అయినప్పటికీ ప్రతి ఒక్కరికీ దీనిపై కనీస అవగాహన ఉండాల్సిన అవసరం ఉంది. అసలు ఎంఆర్‌పీ అంటే ఏమిటి? దానిని ఎవరు నిర్ణయిస్తారు? ఎవరైనా వ్యాపారి ఈ ఎంఆర్‌పీ కన్నా ఎక్కువకు విక్రయిస్తే ఏం చేయాలి? ఫిర్యాదులు చేయాలంటే ఎక్కడ చేయాలి? వంటి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఎంఆర్‌పీ అంటే..
మ్యాగ్జిమమ్ రిటైల్ ప్రైస్(ఎంఆర్‌పీ) అనేది ఆ ఉత్పత్తి లేబుల్ లేదా ప్యాకేజింగ్‌పై ముద్రించి ఉంటుంది. ఎంఆర్‌పీలో ఉత్పత్తి ఖర్చులు, మార్కెటింగ్ ఖర్చులు, ట్రాన్స్‌పోర్టు ఖర‍్చులు, ఉత్పత్తిదారులు, విక్రేతల లాభాల మార్జిన్ కలిపి ఉంటుంది. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకొని ఆ ఉత్పత్తి తయారీదారుడు లేదా విక్రేతలు ఎంఆర్‌పీ ధరలను నిర్ణయిస్తారు. ఇది ఆ ఉత్పత్తిపై వినియోగదారు నుంచి రిటైలర్ చట్టబద్ధంగా వసూలు చేయగల అత్యధిక మొత్తాన్ని ఈ ఎంఆర్‌పీ సూచిస్తుంది.
ఎంఆర్‌పీ అవసరమా?
ఎంఆర్‌పీ అనేది అధిక ధరలను వసూలు చేసే రిటైలర్ల నుంచి కస్టమర్ అయిన మీకు రక్షణ కల్పిస్తుంది. ఇది గందరగోళం, దోపిడీని నివారించడానికి బెంచ్‌మార్క్ ధరను ఏర్పాటు చేస్తుంది.
చట్టం ఏం చెబుతోంది..
మన దేశంలో 2009 లీగల్ మెట్రాలజీ చట్టం ప్యాక్ చేసి ఉన్న వస్తువుల విక్రయాన్ని నియంత్రిస్తుంది. దీని ప్రకారం ఉత్పత్తి లేబుల్‌లు లేదా ప్యాకేజింగ్‌పై ఎంఆర్‌పీని స్పష్టంగా పేర్కొనాల్సి ఉంటుంది. ఆ లేబుల్‌పై ఎంఆర్‌పీ కన్నా ఎక్కువకు ఉత్పత్తులను విక్రయిస్తే చట్టరీత్యా నేరం అవుతుంది. దీనికి జరిమానాలతో పాటు ఇతర చట్టపరమైన చర్యలు ఉంటాయి. ప్రతి ప్యాక్‌పై వస్తువు నికర పరిమాణం, ఎంఆర్‌పీ, తయారీ తేదీ, ఎక్స్‌పైరీ తేదీ తప్పనిసరిగా ఉండాల్సి ఉంటుంది.
ఎంఆర్‌పీ కంటే ఎక్కువకు విక్రయిస్తే..