Andhrapradesh

Modi: నేడు రూ.10 లక్షల కోట్లకుపైగా విలువైన ప్రాజెక్టులను ప్రారంభించనున్న మోదీ

Published

on

ఉత్తరప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రూ.10 లక్షల కోట్లకుపైగా విలువైన 14,000 ప్రాజెక్టులను ప్రధాని నరేంద్ర మోదీ నేడు ప్రారంభించనున్నారు. సోమవారం జరిగే యూపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023 నాల్గో గ్రౌండ్ బ్రేకింగ్ వేడుకలో భాగంగా ప్రధాని ఈ ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు.
ప్రధాన మంత్రి కార్యాలయం తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయం 10:30 గంటల సమయంలో సంభాల్ జిల్లాలో శ్రీకల్కి ధామ్ ఆలయానికి ప్రధానిమంత్రి మోదీ శంకుస్థాపన చేయనున్నారు. అలాగే శ్రీకల్కి ధామ్ ఆలయం నమూనాను కూడా ఆవిష్కరించనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేయనున్న సభలో ప్రధాని ప్రసంగిస్తారు. కాగా శ్రీకల్కి ధామ్ ఆలయం నిర్మాణాన్ని ఆలస ట్రస్ట్ చేపట్టనుంది. ఈ ఆలయ ట్రస్ట్ చైర్మన్‌గా ఆచార్య ప్రమోద్ కృష్ణం ఉన్నారు. శ్రీకల్కి ధామ్ ఆలయ ప్రారంభోత్సవానికి పలువురు సాధువులు, మత పెద్దలు, ఇతర ప్రముఖులు హాజరుకానున్నారు.

అనంతరం మధ్యాహ్నం 1:45 గంటలకు ఫిబ్రవరిలో జరిగిన యూపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023 (యూపీజీఐఎస్ 2023) సందర్భంగా స్వీకరించిన రూ.10 లక్షల కోట్ల కంటే ఎక్కువ విలువైన 14000 ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. ఈ ప్రాజెక్ట్‌లు పునరుత్పాదక శక్తి, ఐటీ, ఐటీఈఎస్, ఫుడ్ ప్రాసెసింగ్, హౌసింగ్, రియల్ ఎస్టేట్, హాస్పిటాలిటీ, వినోదం, విద్య వంటి రంగాలకు సంబంధించినవి. కాగా ఈ కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్తలు, అగ్రశ్రేణి గ్లోబల్, భారతీయ కంపెనీల ప్రతినిధులు, రాయబారులు, హైకమిషనర్లు, ఇతర విశిష్ట అతిథులతో సహా సుమారు 5000 మంది పాల్గొననున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version