Hyderabad

Mlc Kavitha Arrest : ఎమ్మెల్సీ కవితపై ప్రశ్నల వర్షం.. తొలిరోజు ముగిసిన ఈడీ కస్టడీ, ఏమేం అడిగారంటే..

Published

on

Mlc Kavitha Arrest : తొలి రోజు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ(ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్) కస్టడీ ముగిసింది. ఈడీ అధికారులు కవితపై ప్రశ్నల వర్షం కురిపించారు. ముఖ్యంగా మనీ లాండరింగ్ కు సంబంధించి అనేక ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. అటు ఢిల్లీలో ఈడీ కస్టడీలో ఉన్న ఎమ్మెల్సీ కవితను కుటుంబసభ్యులు కలిశారు. ఈడీ కార్యాలయానికి వెళ్లిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీశ్ రావు కవితను పరామర్శించారు. ఆమెకు ధైర్యం చెప్పారు.

కవితను కుటుంబసభ్యులు కలిసిన సమయంలో ఈడీ అధికారులు ఉండొద్దని ఇప్పటికే రౌస్ అవెన్యూ కోర్టు ఉత్తర్వుల్లో ఇచ్చింది. మరోపక్క రేపు సుప్రీంకోర్టులో కవిత అరెస్ట్ అంశాన్ని ప్రస్తావించనున్నారు కవిత తరుపు న్యాయవాదులు. ఇప్పటికే సుప్రీంకోర్టులో న్యాయవాదులను కలిశారు కేటీఆర్, ఇతర కుటుంబసభ్యులు. ఎల్లుండి కవిత ఈడీ విచారణపై సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ ఇప్పటికే లిస్ట్ అయ్యింది. లిక్కర్ స్కామ్ కేసులో ట్రయల్ కోర్టు, సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేసేందుకు సిద్ధమయ్యారు కవిత కుటుంబసభ్యులు.

లిక్కర్ స్కామ్ లో మనీలాండరింగ్ చట్టం కింద కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. వారం రోజలు ఈడీ కస్టడీకి కవితను రౌస్ అవెన్యూ కోర్టు అనుమతించింది. ఈడీ కేంద్ర కార్యాలయంలోనే కవిత ఉన్నారు. ఇవాళ ఉదయం నుంచి సాయంత్రం వరకు కవితను ప్రశ్నించారు. 100 కోట్ల ముడుపుల వ్యవహారానికి సంబంధించి కవితను ఈడీ అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అలాగే మొబైల్ లో డేటా ఎరేజ్ చేయడంతో పాటు లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులు ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగా అనేక ప్రశ్నల్లో కవితను అడిగినట్లు తెలుస్తోంది. సౌత్ గ్రూప్ తో ఉన్న సంబంధాలు.. కేజ్రీవాల్, సిసోడియాతో చర్చలు జరిపారా? కంపెనీలో వాటా ఉందా? అక్కడి నుంచి మీకు లాభాలు అందాయి అన్నట్లు కొందరు నిందితులు వాంగూల్మాలు ఇచ్చారు. దానికి మీరు ఏమంటారు? అని ప్రశ్నల వర్షం కురిపించారు ఈడీ అధికారులు.

”ఢిల్లీ, హైదరాబాద్ లో జరిగిన సమావేశాల్లో పాల్గొన్నారా? ఎవరెవరు పాల్గొన్నారు? లిక్కర్ పాలసీ రూపకల్పన సమయంలో పాలసీలో చేయాల్సిన మార్పులకు సంబంధించి ఏమైనా సూచనలు చేశారా? కమిషన్ రేట్లు పెంపుదలకు సంబంధించిన అంశాలపైన మీతో చర్చలు జరిగాయా? ” ఇటువంటి అనేక ప్రశ్నలు కవితను ఈడీ అధికారులు అడిగినట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version