National

5రోజుల్లో లక్ష మందిని కలిసిన ముఖ్యమంత్రి- జెట్​ స్పీడ్​లో కొత్త సీఎం

Published

on

Odisha CM Meets People : ఒడిశాలోని కొత్త ముఖ్యమంత్రి మోహన్​ చరణ్​ మాఝి కేవలం ఐదు రోజుల్లోనే దాదాపు లక్ష మంది ప్రజలను కలిశారు. ఈ మేరకు భారీ సంఖ్యలో ప్రజలను కలిసినట్లు సీఎంఓ ఓ ప్రకటనలో పేర్కొంది. సీఎంగా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి మహిళలు, పిల్లలు, వికలాంగులతో సహా లక్ష మంది కలిసినట్లు తెలిపింది. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రజలను కలిసేందుకు కేటాయిస్తే, ఉదయం 6 నుంచే క్యూలో ఉన్నారని సీఎం మోహన్ చరణ్ మాఝి తెలిపారు. ‘గత ప్రభుత్వంలో ప్రజల అవసరాలకు అనుగుణంగా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదు. అందుకే ప్రజలు బీజేపీకి ఓటు వేసి అధికారంలోకి వచ్చేలా చేశారు. 4.5 కోట్ల ప్రజలకు సేవ చేసే అవకాశం నాకు వచ్చింది. ఈ ఐదేళ్లలో రాబోయే 50 సంవత్సరాల పాటు ప్రభావం చూపేలా అభివృద్ధి చేస్తాం’ అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version