Business

మస్క్​ను దాటేసిన జెఫ్​ బెజోస్​.. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు

Published

on

అమెజాన్ ఫౌండర్​ జెఫ్​బెజోస్​ ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా ఎదిగారు. ఆయన నికర విలువ ప్రస్తుతం 200 బిలియన్​ డాలర్లకు పెరిగింది. టెస్లా చీఫ్ ఎలాన్​మస్క్​ 198 బిలియన్​ డాలర్ల నెట్​వర్త్​తో రెండోస్థానానికి పడిపోయారని బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ మంగళవారం వెల్లడించింది.
2024లో బెజోస్ ఇప్పటి వరకు 23 బిలియన్​ డాలర్లు లాభపడగా, మస్క్ 31బిలియన్​ డాలర్లు నష్టపోయారు.
బిలియనీర్ల సంపద, లాభనష్టాలు షేర్లను బట్టి మారుతుంటాయి. అమెజాన్ షేర్ ధర ఈ ఏడాది 18 శాతానికి పైగా పెరగగా, టెస్లా 24 శాతం పడిపోయింది. ఈ నెల ప్రారంభంలో 8.5బిలియన్​ డాలర్ల విలువైన అమెజాన్ షేర్లను విక్రయించినప్పటికీ, బెజోస్ 9.56 శాతం వాటాతో ఈ-కామర్స్ కంపెనీలో అతిపెద్ద వాటాదారు. టెస్లాలో మస్క్‌కు 20 శాతం వాటా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version