National

మార్చి 9న అరుణాచల్‌ప్రదేశ్‌లో టన్నెల్‌ను ప్రారంభించనున్న మోదీ

Published

on

పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించేందుకు ప్రధాని మోదీ మార్చి 9న అరుణాచల్‌ప్రదేశ్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్బంగా చైనా సరిహద్దులో ఉన్న తవాంగ్‌లో నిర్మించినటువంటి సెలా టన్నెల్‌ ప్రారంభిస్తారు.

పశ్చిమ కమెంగ్ జిల్లాలోని బైసాఖిలో జరిగే కార్యక్రమంలో ప్రధాని మోదీ ఈ సొరంగాన్ని జాతికి అంకితం చేస్తారని అధికారులు తెలిపారు. దీంతో పాటు దాదాపు 20 అభివృద్ధి ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు.

13,000 అడుగుల ఎత్తులో ఉన్న సెలా టన్నెల్‌ ప్రాజెక్ట్‌కు ఫిబ్రవరి 2019లో ప్రధాని మోదీ పునాది వేశారు. హిమపాతం, భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటం వలన బలిపర-చరిద్వార్-తవాంగ్ రహదారిని తరుచుగా మూసివేయాల్సి రావడంతో ఇబ్బందులు ఎదురవుతున్న దృష్ట్యా ఈ టన్నెల్ నిర్మాణాన్ని చేపట్టారు. ఇది అన్ని వాతావరణ పరిస్థితులను తట్టుకుంటుందని అధికారులు తెలిపారు. చైనా-భారత్ సరిహద్దులోని LACకి సమీపంలో ఉన్నందున ఈ సొరంగం వ్యూహాత్మకంగా ముఖ్యమైనది. దీని ద్వారా సరిహద్దు ప్రాంతాలకు దళాలు, ఆయుధాలు, యంత్రాలను వేగంగా చేరవేయడానికి అవకాశం ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version