Cinema

Manjummel Boys: పది కోట్లతో నిర్మిస్తే 100 కోట్లు వసూలు చేసిన సినిమా.. సెన్సేషన్ అవుతున్న మలయాళీ మూవీ..

Published

on

బాక్సాఫీస్ వద్ద ఇప్పుడంతా మలయాళీ చిత్రాల జోరు నడుస్తోంది. స్టార్ హీరోస్ కాదు.. టాప్ డైరెక్టర్స్ లేరు.. కానీ అత్యధిక వసూళ్లు రాబడుతూ సెన్సెషన్ సృష్టిస్తున్నాయి.

ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాలుగా అడియన్స్ ముందుకు వచ్చి ఊహించని రేంజ్‏లో హిట్టవుతున్నాయి. దీంతో అదే చిత్రాలను మిగతా భాషల్లోకి డబ్ చేయగా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇప్పటికే ట్రూ లవర్, హాస్టల్ బాయ్స్, జో వంటి చిత్రాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇప్పుడు మరో సినిమా థియేటర్లలో భారీ కలెక్షన్స్ సాధిస్తుంది. తక్కువ బడ్జెట్ అయిన మలయాళీ సినిమా ప్రపంచ బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.దీంతో ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి చర్చ నడుస్తుంది. కేవలం 10 కోట్లతో నిర్మిస్తే వంద కోట్ల క్లబ్‏లో చేరిన సినిమాపైనే అందరి దృష్టి పడింది. ఇంతకీ ఆ టైటిల్ ఏంటీ అనుకుంటున్నారా ?.. అదే ‘మంజుమేల్ బాయ్స్’.

కేవలం పది కోట్లతో నిర్మిస్తే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. చిదంబరం దర్శకత్వం వహించిన ఈ చిత్రం యదార్థ సంఘటన ఆధారంగా రూపొందించబడింది. ఈ సినిమాలోని కామెడీ మరియు థ్రిల్లర్ అంశాలు ప్రేక్షకులను ఎంతగానోఆకట్టుకున్నాయి. మంజుమేల్ బాయ్స్ అనే యువకుల బృందం తమిళనాడులోని కొడైకెనాల్‌లోని ‘గుణ గుహలు’కి విహారయాత్రకు వెళ్లే కథతో ఈ చిత్రం ఉంటుంది. కమల్ హాసన్ అభిమానులు అయిన ఆ యువకులు ‘గుణ’ షూటింగ్ జరిగిన ‘గుణ కేవ్స్’ వద్దకు వెళ్తారు. అదే సమయంలో తమ టీంలోని ఓ యువకుడు డెవిల్స్ కిచెన్‌లో పడిపోతాడు. దీంతో మిగతా సభ్యులు తమ స్నేహితుడిని ఎలా కాపాడుకున్నారు అనేది మంజుమేల్ బాయ్స్ కథ. ఇందులో సోబిన్, శ్రీనాథ్ బస్సీ, బాలు, లాల్జీ తదితరులు నటించారు.
తమిళంలోనూ ఈ చిత్రాన్ని డబ్ చేయగా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇప్పటికే ఈ మూవీ చూసి ప్రశంసలు కురిపించారు కమల్. అటు తమిళంలోనూ రికార్డ్స్ సృష్టిస్తుంది ఈ చిత్రం. తమిళనాడులో రజనీకాంత్ ‘లాల్ సలామ్’ కలెక్షన్ల కంటే ‘మంజుమేల్ బోయ్సా’ మంచి వసూళ్లు రాబడుతోంది. ఈ చిత్రం ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 100 కోట్లకు పైగా వసూలు చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version