Spiritual

Maha Shivaratri 2024 : శివుడిలోని ఈ లక్షణాలను మీ జీవితంలో అలవర్చుకోండి..

Published

on

సముద్రం మథనం నుంచి విషం బయటకు రాగానే అందరూ ఒక అడుగు వెనక్కి వేయగా శివుడు స్వయంగా ఆ విషం తాగాడు. శివుడు అందరి మంచి కోరేవాడు. శివుని వ్యక్తిత్వం నుంచి కొన్ని లక్షణాలను అలవరచుకుంటే నైపుణ్యం కలిగిన యోధుడిగా జీవించవచ్చు. ఏయే లక్షణాలు తెలుసుకునేందుకు ఆర్టికల్‌లోకి వెళ్లండి.
Life Of Maha Shiv : మార్చి 8న మహాశివరాత్రి(Maha Shivaratri) ఉత్సవాలు ఘనంగా జరగబోతున్నాయి. పార్వతీ దేవి, శివుడి వివాహానికి గుర్తుగా మహాశివరాత్రి పండుగను జరుపుకుంటారు. ఇక శివుడిది సింపుల్‌ లైఫ్‌. శరీరంపై దుస్తులకు బదులుగా జంతు చర్మాలు ధరించేవాడు. ప్రాపంచిక విషయాలకు దూరంగా ఉండే శివుని వ్యక్తిత్వం చాలా సింపుల్‌గా ఉంటుంది.

ఈ మహాశివరాత్రి సందర్భంగా శివుడి లక్షణాల గురించి తెలుసుకోండి. వీటిని మీ వ్యక్తిత్వంలో చేర్చడం ద్వారా మీరు ఆదర్శవంతమైన జీవితాన్ని గడపవచ్చు:

పరమశివుడుని ఈ విశ్వంలో గొప్ప యోగిగా భావిస్తారు. ప్రతి సందర్భంలోనూ మిమ్మల్ని మీరు నియంత్రించుకోవడం అంత ఈజీ కాదు. కానీ శివుడు ధ్యానంలో కూర్చున్నప్పుడు అతని దృష్టిని ఎవరూ మరల్చలేరు.

పాజిటివ్‌గా ఉండటం శివుడు లక్షణాల్లో(Attributes Of Shiva) ఒకటి. సముద్రం మథనం నుంచి విషం బయటకు రాగానే అందరూ ఒక అడుగు వెనక్కి వేయగా శివుడు స్వయంగా ఆ విషం తాగాడు.

శివుడు జీవనశైలి(Shiva Life Style) పూర్తిగా భిన్నమైన రీతిలో ఉంటుంది. తాండవ్ చేస్తున్నప్పుడు కొన్నిసార్లు నటరాజ్ అయ్యాడు. విషం తాగిన నీలకంఠుడయ్యాడు. పార్వతీదేవిని తనలో లీనం చేసుకుని అర్ధనారీశ్వరుడు అయ్యాడు. మీ జీవితాన్ని స్వేచ్ఛగా గడపండి. ప్రతి భావోద్వేగాన్ని సరైన సమయంలో వ్యక్తీకరించండి. ఇదే ఆయన జీవితం చెబుతున్న సత్యం.

Advertisement

ప్రాధాన్యతలను అర్థం చేసుకోవడం, దాని ప్రకారంగా వ్యవహరించడం శివుడి లక్షణాల్లో ప్రధానమైనవి.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. infoline దీనిని ధృవీకరించడంలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version