Weather
బంగాళాఖాతంలో అల్పపీడనం తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
వాతావరణ శాఖ తెలుగు రాష్ట్రాలకు శుభవార్త చెప్పింది. మే 23 వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.
దీంతో పాటు ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందని పేర్కొంది. మే 22 నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది. ఇది మే 24 నాటికి బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. వాయిగుండంగా మారితే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది.
ప్రస్తుతానికి ఏపీ మీదుగా శ్రీలంక వరకు ఉపరితల ఆవర్త ద్రోణి కొనసాగుతోందని తెలిపింది. ఇది సముద్ర మట్టానికి 3.1 కిమీటర్ల ఎత్తులో ఉందని పేర్కొంది. దీని కారణంగా తెలంగాణలో మే 23 వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వానలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.
ఇప్పటికే గత వారం రోజులుగా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. శనివారం హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. అటు ఏపీలో కూడా భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని పేర్కొంది. రుతుపవనాలు కూడా చురుగ్గా కదులుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి రుతుపవనాలు దక్షిణ అండమాన్ సముద్రంలో ప్రవేశించాయని తెలిపింది. ఆదివారంలోకి బంగాళాఖాతంలోని ఆగ్నేయ ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించనున్నాయి.
రుతుపవనాలు మే 31 కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉంది. ఆ తర్వాత కేరళ అంతా వ్యాపించనున్నాయి. జూన్ 6 తర్వాత రుతుపవనాలు తెలంగాణలో కూడా విస్తరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. వర్షాలు సకాలంలో పడితే పంటలు సాగు మొదలు పెట్టేందుకు అన్నదాతలు సిద్ధంగా ఉన్నారు. రాష్ట్రంలో సమృద్ధి వర్షాలు కురిస్తే రైతులు వరి సాగు వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది.
Weather
ఇక ఏపీలో వానల జాతర.. వచ్చే 2 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు.
గురువారం నుంచి ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి ఋతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో, ఉత్తరకోస్తాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు, దక్షిణ కోస్తా జిల్లాల్లో చాలా చోట్ల విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీస్తాయని.. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని పేర్కొన్నారు. తుఫాన్ హెచ్చరికలతో మత్స్యకారులు రేపటి నుంచి వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.
అటు తెలంగాణలో వెదర్ అలర్ట్‌ను పరిశీలిస్తే.. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం ప్రస్తుతం బలహీన పడింది. ఎల్లుండి మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఉత్తర ఈశాన్య జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెబుతోంది..వాతావరణ శాఖ. హైదరాబాద్‌లో ఈ రాత్రికి తేలికపాటి వర్షం పడే అవకాశం ఉంది. గంటకు 30 నుంచి 40 కి.మీ.వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అంచనా వేస్తున్నారు.
Weather
హెచ్చరిక: బంగాళాఖాతంలో అల్పపీడనం
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. కొద్దిరోజులుగా వేసవికాలానికి తీసిపోని రీతిలో ఎండలు మండిస్తుంటే ఇబ్బంది పడిన ప్రజానీకం ప్రస్తుతం వాతావరణం చల్లబడటంతో హాయిగా ఊపిరి పీల్చుకుంటోంది. తాజాగా అమరావతి వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడబోతోంది. దీని ప్రభావంతో రానున్న ఐదురోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయి. కొన్ని ప్రాంతాల్లో సాధారణ వర్షపాతం.. మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురుస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
నైరుతి రుతుపవనాలు బలపడి రాష్ట్రమంతటా విస్తరించివున్నాయి. రేపు ఏర్పడే అల్పపీడనం విశాఖపట్నం-భువనేశ్వర్ మధ్య తీరాన్ని తాకుతుంది. రాయలసీమ, ఉత్తరాంధ్ర, మధ్యాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. ఈశాన్య అస్సోం నుంచి వాయువ్య బంగాళాఖాతం వరకు ప్రస్తుతం రెండు ద్రోణులు కొనసాగుతుండటంతో సోమ, మంగళవారాల్లో కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. రాయలసీమలో తేలికపాటి జల్లలు, ఏలూరు, గుంటూరు, బాపట్ల, పల్నాడు, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, ప్రకాశం, చిత్తూరు, నంద్యాల జిల్లాల్లో మోస్తరు వానలు పడతాయి
Weather
Rain Alert: చల్ల చల్లని కూల్ న్యూస్ వచ్చేసింది.. ఇక వచ్చే ఐదు రోజులు వర్షాలే.. వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
వాతావరణశాఖ కూల్ న్యూస్ చెప్పింది.. వచ్చే ఐదు రోజులు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.. ఐఎండి సూచనల ప్రకారం.. మధ్య గుజరాత్ ప్రాంతంలో ఆవర్తనం కొనసాగుతుందని, తూర్పు విదర్భ వరకు ద్రోణి విస్తరించి ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ వివరించారు. వీటి ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమలో రాబోయే 5 రోజులలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. గురువారం, శుక్రవారం అక్కడక్కడ కోస్తాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. భారీ వర్షాల నేపధ్యంలో లొతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
గురువారం.. పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.
శుక్రవారం… పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. శ్రీకాకుళం, అనకాపల్లి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, నంద్యాల, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
ఉరుములతో కూడిన వర్షం పడేపుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్లు, పోల్స్, టవర్స్ క్రింద ఉండరాదన్నారు. బహిరంగ ప్రదేశాల్లో ఉండకుండా సురక్షిత భవనాల్లో ఆశ్రయం పొందాలని సూచించారు.
బధవారం సాయంత్రం 5 గంటల నాటికి అనకాపల్లి జిల్లా యలమంచిలిలో 70మిమీ, శ్రీకాకుళం ఎచ్చేర్లలో 68.2మిమీ, అనకాపల్లి జిల్లా పరవాడలో 55.7మిమీ, విజయనగరం జిల్లా రాజాంలో 54.5మిమీ, విజయనగరం జిల్లా సంతకవిటిలో 42మిమీ, శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో 38.7మిమీ చొప్పున వర్షపాతం నమోదైందని తెలిపారు.
-
Business4 months ago
Jio.. వినియోగదారులకు ముఖేష్ అంబానీ బంపర్ ఆఫర్…. 299 రూపాయలకే సంవత్సరం అంతా…
-
Career4 months ago
విద్యార్థులకు గుడ్ న్యూస్: భారత ప్రభుత్వం అందిస్తోన్న సాఫ్ట్వేర్ కోర్సులు..అప్లయ్ చేసుకోండి..!
-
National4 months ago
IRCTC Tatkal Ticket ఇలా చేస్తే.. ట్రైన్ తత్కాల్ టికెట్ వెంటనే బుక్ అయిపోతుందని తెలుసా.. మీరూ ఓసారి ట్రై చేసి చూడండి..
-
Business4 months ago
ఈనెలలో వడ్డీ రేట్లు పెంచిన బ్యాంకులివే.. 9.10 శాతం ఆఫర్.. రూ.1 లక్షకు ఎంతొస్తుంది
-
News4 months ago
జూన్ 1 నుండి కొత్త ట్రాఫిక్ నిబంధనలు
-
Business4 months ago
ఉద్యోగులకు TCS కొత్త రూల్! ఉద్యోగులు అలా చేస్తే జీతంలో కోతలు
-
Education3 months ago
వచ్చే వారం నుంచి పాఠశాలల పునఃప్రారంభం.. తల్లిదండ్రుల ఆందోళన ఇందుకేనా!
-
National3 months ago
Toll Plaza: ఇక ఫాస్టాగ్స్‌కు గుడ్‌బై.. టోల్ ప్లాజాల వద్ద కొత్త టెక్నాలజీ.. కేంద్రం కీలక నిర్ణయం!
-
Andhrapradesh3 months ago
ఏపీలో మహిళలకు ఉచిత బస్సు అమలు – బిగ్ అప్డేట్..!!
-
National4 months ago
అయోధ్యలోనూ తిరుమల తరహాలో.. గుడ్‌న్యూస్ చెప్పిన దినేశ్ రామచంద్ర
-
Crime News3 months ago
జమ్మూ కాశ్మీర్లో దాడి చేసింది మేమే …TRF ప్రకటన
-
Telangana4 months ago
Telangana: విద్యార్థులకు గమనిక.. మారిన ప్రభుత్వ పాఠశాలల టైమింగ్స్
-
Andhrapradesh3 months ago
జులై 1న మెగా డీఎస్సీ తో పాటు, టెట్ నోటిఫికేషన్
-
Spiritual3 months ago
Tirumala : గోవిందనామంతో హోరెత్తుతున్న తిరుమల గిరులు
-
National3 months ago
నరేంద్ర మోడీ మంత్రి వర్గం ….వారి శాఖలు
-
Railways3 months ago
పశ్చిమ బెంగాల్లో రైలు ప్రమాదం …కారణం ఇదే
-
Andhrapradesh3 months ago
పవన్ కొత్త బాధ్యతలు ఖరారు చేసిన చంద్రబాబు – ఏరి కోరి..!!
-
National3 months ago
ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోడీ తొలి సంతకం ఈ ఫైలు పైనే
-
Andhrapradesh3 months ago
250 ప్రోక్లైన్లతో చెట్లు తొలగింపు… అమరావతి ప్రక్షాళన
-
National3 months ago
కాశ్మీర్లో మళ్లీ ఉగ్రదాడి ఆర్మీ బేస్ పై కాల్పులు…. ఒకరి మృతి
-
Political3 months ago
పొత్తు పెట్టుకుందామని చెప్పిన మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ ..,…చంద్రబాబు
-
Political3 months ago
కిరణ్ కుమార్ రెడ్డికి రాజయోగం …ఓకే అన్న చంద్రబాబు
-
Andhrapradesh3 months ago
వైసీపీ ఎంపీల బీజేపీ బాట – చంద్రబాబు ఫార్ములా..!!
-
Andhrapradesh3 months ago
ఆంధ్రప్రదేశ్‌లో కాబోయే మంత్రులు వీరే…
-
National4 months ago
Cyclone Remal: తీరం దాటిన తీవ్ర తుఫాన్.. ఆ ప్రాంతాలన్నీ అల్లకల్లోలం.. బలమైన ఈదురుగాలులు.!
-
Andhrapradesh3 months ago
సీనియర్ సిటిజన్లకు మంచి వార్త… తిరుమల
-
Weather3 months ago
జాడలేని వానలు….. ఇలాగైతే కష్టమే…
-
Education3 months ago
ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు శుభవార్త
-
International4 months ago
‘పోస్ట్ స్టడీ వర్క్ ఆఫర్ కొనసాగిస్తున్నాం’- బ్రిటన్ వెళ్లే విద్యార్థులకు గుడ్ న్యూస్ – UK Graduate Route Visa
-
Andhrapradesh3 months ago
SCHOOL HOLIDAYS: స్కూలు సెలవులు పొడగింపు.. పున:ప్రారంభం తేదీ మార్పు?
-
Business4 months ago
ఈ నైపుణ్యాలున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు ఫుల్ డిమాండ్.. కోట్ల రూపాయల శాలరీ
-
National4 months ago
Lok Sabha Election 2024 Phase 6: రేపే ఆరో దశ లోక్‌సభ ఎన్నికలు.. 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో 58 సీట్లకు పోలింగ్
-
Andhrapradesh3 months ago
Tirumala News: తిరుమల కాలినడక భక్తులకు అలర్ట్… టీటీడీ కొత్త నిర్ణయం
-
News3 months ago
రామోజీరావుకు ఏపీ ప్రభుత్వం ఘన నివాళి రెండు రోజులు సంతాప దినాలు
-
Cinema6 months ago
Anudeep KV – Aditya Haasan: టాలీవుడ్ కు దొరికిన మరో జాతిరత్నం.! ట్రేండింగ్ లో ఆదిత్య – అనుదీప్.
-
Andhrapradesh3 months ago
రిటైర్డ్ ఉద్యోగస్తుల విషయంలో ప్రభుత్వం కీలక ఆదేశాలు…AP
-
News4 months ago
డబ్బుతో ఎర… ఉద్యోగి ససేమిరా…
-
Railways2 months ago
తిరుపతి, షిర్డి వెళ్లే ఎక్స్ ప్రెస్ రైళ్ల వేళల్లో మార్పు – ఇక నుంచి..!!
-
Andhrapradesh4 months ago
అట్టహాసంగా ప్రారంభమైన పోలేరమ్మ జాతర – పోటెత్తిన భక్తులు – Poleramma Jatara
-
International4 months ago
Pok. లో ఏమి జరుగుతుంది, సైన్యానికి ఎదురు తిరుగుతున్న జనం
-
Andhrapradesh3 months ago
ప్రధాని మోడీ పర్యటనకు …గట్టి భద్రత
-
Spiritual4 months ago
చార్ ధామ్ యాత్రకు పొటెత్తిన భక్తులు.. గత ఏడాదికంటే ఎక్కువే!
-
Andhrapradesh7 months ago
మే నెలకు శ్రీవారి దర్శనం, సేవ టికెట్ల విడుదల తేదీ ప్రకటించిన టీటీడీ
-
Andhrapradesh3 months ago
అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ ఫస్ట్ స్పీచ్,… తప్పకుండా వినాలి
-
News3 months ago
Breaking: ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుకు తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
-
Andhrapradesh3 months ago
ఖరారు కానున్న ఏపీ స్పీకర్ పదవి…
-
Cinema4 months ago
Chiranjeevi: చిరును వరించిన గోల్డెన్ వీసా ప్రత్యేకతలు, ప్రయోజనాలు ఏంటో తెలుసా.?
-
International3 months ago
20 ఏళ్లుగా భారతదేశంలో నివసిస్తున్న ఫ్రెంచి వ్యక్తి…. భారత్ పై అతని అభిప్రాయం
-
Business4 months ago
Bank Holidays June-2024: జూన్‌లో 10 రోజులు బ్యాంకులు బంద్.. ఏయే రోజుల్లో తెలుసా..?
-
Spiritual3 months ago
Tirumala : వెంకటేశా.. ఇంత సమయమా?