National
Loksabha : ఈనెల 24 నుంచి ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు….. స్పీకర్ ఎన్నిక!
నెల 24 నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. రెండ్రోజుల పాటు ఎంపీల ప్రమాణస్వీకారం ఉండనుంది. 24, 25 తేదీల్లో ఎంపీలంతా ప్రమాణం చేయనున్నారు.
ఇదిలా ఉంటే కొత్త స్పీకర్ ఎంపిక జరిగేంత వరకు ప్రొటెం స్పీకర్ ఉండనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రొటెం స్పీకర్‌ను నియమించనున్నారు. ప్రొటెం స్పీకర్ ఆధ్వర్యంలో ఎంపీలంతా ప్రమాణం చేయనున్నారు. అనంతరం ఈనెల 26న కొత్త స్పీకర్ ఎంపిక జరగనుంది. అటు తర్వాత సమావేశాలు జూలై 3 వరకు సమావేశాలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే లోక్‌సభ స్పీకర్ పోస్టుపై ఎన్డీఏ కూటమిలో గట్టి పోటీ నెలకొంది. ఈ పోస్టుపై జేడీయూ కన్నేసింది. స్పీకర్ పోస్టు తమకు ఇవ్వాలంటూ నితీష్ కుమార్ కోరుతున్నట్లు తెలుస్తోంది. అదే బాటలో తెలుగు దేశం అధినేత చంద్రబాబు కూడా ఉన్నట్లు సమాచారం. స్పీకర్ పోస్టు టీడీపీకి ఇవ్వాలని కోరుతున్నట్లు సమాచారం. అయితే స్పీకర్ పోస్టు మాత్రం తమ దగ్గరే ఉంచుకోవాలని బీజేపీ కూడా భావిస్తోంది. ఎన్డీఏ భాగస్వామ్యంతో మోడీ సర్కార్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఈ స్పీకర్ పోస్టు ఎవరికి దక్కుతుందోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.
ఇదిలా ఉంటే ఆదివారం మోడీ 3.0 సర్కార్ ఏర్పడింది. 71 మంది కేంద్రమంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. అలాగే మంత్రులకు సోమవారం శాఖలు కూడా కేటాయించారు. పాత మంత్రులకు పాత శాఖలే కేటాయించడం విశేషం.