National

లోక్‌సభ ప్రొటెం స్పీకర్‌గా భర్తృహరి మహతాబ్‌

Published

on

Lok Sabha Protem Speaker 2024 : లోక్‌సభ ప్రొటెం స్పీకర్‌గా ఒడిశాకు చెందిన సీనియర్‌ ఎంపీ భర్తృహరి మహతాబ్‌ వ్యవహరించనున్నారు. ఈ విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు వెల్లడించారు. ఒడిశాలోని కటక్‌ నుంచి ఏడుసార్లు విజయం సాధించిన భర్తృహరి, స్పీకర్‌ ఎన్నిక పూర్తయ్యే వరకు లోక్‌సభ ప్రిసైడింగ్‌ అధికారిగా కార్యకలాపాలు నిర్వహిస్తారని తెలిపారు.

18వ లోక్‌సభకు కొత్తగా ఎన్నికైన సభ్యులతో ప్రొటెం స్పీకర్‌ ప్రమాణం చేయిస్తారని కిరణ్ రిజుజు చెప్పారు. ఆయనకు కె.సురేష్‌ (కాంగ్రెస్‌), టీఆర్‌ బాలు (డీఎంకే)తో పాటు రాధామోహన్‌ సింగ్‌ (బీజేపీ), ఫగ్గన్‌ సింగ్‌ కులస్తే (బీజేపీ), సుదీప్‌ బంధోపాధ్యాయ (టీఎంసీ) ఛైర్‌పర్సన్‌ల ప్యానెల్‌ సహాయంగా ఉంటుందని మంత్రి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version