National
Lok Sabha Elections : ఎన్డీఏ వర్సెస్ ఇండియా.. ఎన్నికల సమరానికి సర్వం సిద్ధం!
Lok Sabha Elections 2024 : 2024 లోక్‌సభ ఎన్నికల సమరానికి సమయం ఆసన్నమైంది. హ్యాట్రిక్ కొట్టాలని బీజేపీ భావిస్తుండగా.. మోదీ ప్రభుత్వాన్ని గద్దెదించాలని ఇండియా కూటమి ప్రణాళికలు రచిస్తోంది. మరి ఓటరు ఓటు ఎవరికి?
పోలింగ్ టైమింగ్స్ ఇవే..
Fri, 19 Apr 2024 ఉదయం 7 గంటలకు మొదలయ్యే లోక్‌సభ ఎన్నికల తొలి దశ పోలింగ్.. సాయంత్రం 6 గంటలకు పూర్తవుతుంది.
టార్గెట్ 400..
2019 ఎన్నికల్లో బీజేపీ 303 స్థానాల్లో గెలిచింది. ఈసారి 370 సీట్లు సంపాదించాలని చూస్తోంది. మొత్తం మీద.. 543 సీట్లల్లో 400 కన్నా ఎక్కువ స్థానాల్లో గెలవాలని టార్గెట్‌గా పెట్టుకుంది.
ఈవీఎం మాక్ టెస్ట్..
లోక్‌సభ ఎన్నికల తొలి దశ పోలింగ్‌లో భాగంగా.. ప్రస్తుతం వివిధ పోలింగ్ స్టేషన్స్‌లో ఈవీఎం మాక్ టెస్ట్‌లు జరుగుతున్నాయి. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ మొదలువుతుంది.
1.87లక్షల పోలింగ్ కేంద్రాల్లో..
తొలి దశ పోలింగ్‌లో భాగంగా.. 1,87,000 పోలింగ్ కేంద్రాల్లో.. 166 మిలియన్ మంది ఓటర్లు.. నేడు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
నేడు పోలింగ్ జరగనున్న ప్రాంతాలు..
తొలి దశ పోలింగ్‌లో భాగంగా.. తమిళనాడు (39), రాజస్థాన్ (12), ఉత్తర్‌ప్రదేశ్ (8), మధ్యప్రదేశ్ (6), ఉత్తరాఖండ్ (5), అరుణాచల్‌ప్రదేశ్ (2), మేఘాలయ (2), అండమాన్ అండ్ నికోబార్ (1), మిజోరం (1), నాగాలాండ్ (1), పుదుచ్చెరి (1), సిక్కిం (1), లక్షద్వీప్ (1), అసోం (5), మహారాష్ట్ర (5), బిహార్ (4), మణిపూర్ (2), పశ్చిమ్ బెంగాల్ (3), త్రిపుర- జమ్ముకశ్మీర్- ఛత్తీస్‌గఢ్‌లో ఒక్కో సీటుకు పోలింగ్ జరగనుంది.
ఈ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా..
లోక్‌సభ ఎన్నికలతో పాటు అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలో.. నేడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అరుణాచల్‌ప్రదేశ్‌లో 60, సిక్కింలో 32 అసెంబ్లీ సీట్లున్నాయి.
లోక్‌సభ ఎన్నికలు 2024..
యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమరానికి ఆసన్నమైంది. ఇంకొన్ని గంటల్లో.. 2024 లోక్‌సభ ఎన్నికల తొలి దశ పోలింగ్ ప్రారంభంకానుంది. హ్యాట్రిక్ విజయంతో తిరిగి అధికారంలోకి రావాలని ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ తీవ్రంగా కృషిచేస్తోంది. మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా ఇండియా కూటమి పావులు కదుపుతోంది. మొత్తం 7 దశల పోలింగ్ ప్రక్రియ శుక్రవారం ఆరంభమవుతుంది. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి.