National

Lok Sabha elections 2024 : లోక్​సభ ఎన్నికల మూడో దశ పోలింగ్​ లైవ్​ అప్డేట్స్​..

Published

on

Lok Sabha elections 2024 phase 3 : 2024 లోక్​సభ ఎన్నికల మూడో దశ పోలింగ్​ సమరానికి సర్వం సిద్ధం. లైవ్​ అప్డేట్స్​ కోసం ఈ హెచ్​టీ తెలుగు పేజ్​ని ఫాలో అవ్వండి..

మోదీ రోడ్​ షో..
ఆంధ్రప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నికల తరుణంలో.. బుధవారం విజయవాడలో భారీ రోడ్​షో నిర్వహించనున్నారు ప్రధాని మోదీ. ఫలితంగా.. విజయవాడలో ట్రాఫిక్​ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి.

ప్రశాంతంగా పోలింగ్​..
93 లోక్​సభ సీట్లల్లో పోలింగ్​ ప్రక్రియ ప్రశాంతంగా సాగుతోంది. ఇంకొద్ది సేపట్లో.. ఓటింగ్​ పర్సెంటేజ్​ వివరాలు వెలువడతాయి.

ఓటు వేసిన శరద పవార్​..
దిగ్గజ నేత, ఎన్​సీపీ-ఎస్​సీపీ వ్యవస్థాపకుడు శరద్​ పవర్​.. తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మహారాష్ట్ర బారామతిలోని ఓ పోలింగ్​ కేంద్రంలో ఓటు వేశారు.

కొనసాగుతున్న ఓటింగ్​..
2024 లోక్​సభ ఎన్నికల మూడో దశ పోలింగ్​ కొనసాగుతోంది. 93 సీట్లకు పోలింగ్​ జరుగుతోంది. 7 దశల పోలింగ్​ తర్వాత.. జూన్​ 4న ఫలితాలు వెలువడతాయి.

Advertisement

‘అందరు ఓటు వేయండి..’
‘లోక్​సభ ఎన్నికల్లో నేను ఓటు వేశాను. ప్రతి ఒక్కరు ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని బలపరచాలని కోరుతున్నాను,’ అని మోదీ ట్వీట్​ చేశారు.

గుజరాత్​లో జోరుగా పోలింగ్​..
బీజేపీ అడ్డా అయిన గుజరాత్​లో లోక్​సభ ఎన్నికల మూడో దశ పోలింగ్​ జోరుగా సాగుతోంది. ప్రధాని మోదీతో పాటు ప్రముఖులు ఒక్కొక్కరుగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ప్రజలు కూడా పోలింగ్​ కేంద్రాల వద్దకు తరలివెళుతున్నారు.

ఓటు వేసిన మోదీ..
అహ్మదాబాద్​లోని ఓ పోలింగ్​ బూత్​లో.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయనతో పాటు కేంద్రమంత్రి అమిత్​ షా కూడా ఉన్నారు.

ఓటు వేసిన అనంతరం.. పోలింగ్​ స్టేషన్​ బయట ఉన్న వందలాది మంది ప్రజలకు అభివాదం చేశారు మోదీ.

పోలింగ్​ బూత్​ వద్ద మోదీ..
అహ్మదాబాద్​లోని పోలింగ్​ బూత్​కి ప్రధాని చేరుకున్నారు. మరికొద్ది సేపట్లో తన ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

Advertisement

అమిత్​ షా ఓటు..
అహ్మదాబాద్​లోని నిశాన్​ పాఠశాలకు వెళ్లిన అమిత్​ షా.. తన ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మరికొద్ది సేపట్లో ప్రధాని మోదీ కూడా ఇక్కడే ఓటు వేయనున్నారు.

పోలింగ్​ ప్రారంభం..
2024 లోక్​సభ ఎన్నికల మూడో దశ పోలింగ్​ ప్రక్రియ ప్రారంభమైంది. ఇంకొద్ది సేపట్లో.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. అహ్మదాబాద్​లోని ఓ స్కూల్​లో ఓటు వేయనున్నారు.

ఆ పోలింగ్​ కూడా..
మధ్యప్రదేశ్​ బేతుల్​లో.. రెండో దశలోనే పోలింగ్​ జరగాల్సి ఉంది. కానీ బీఎస్​పీ పార్టీ అభ్యర్థి మరణంతో మూడో దశకు వాయిదా పడింది. ఇక జమ్ముకశ్మీర్​లో ప్రతికూల వాతావరణం కారణంగా.. అనంతనాగ్​- రాజౌరీ నియోజకవర్గంలో పోలింగ్​ వాయిదా పడింది.

ఈ రాష్ట్రాల్లో నేడు ఓటింగ్​..
అసాం (4), బిహార్​ (5), ఛత్తీస్​గఢ్​ (7), గోవా (2), గుజరాత్​ (26), కర్ణాటక (14), మధ్యప్రదేశ్​ (8), మహారాష్ట్ర (11), యూపీ (10), బెంగాల్​ (4), దాద్రా నగర్​ హవేలీ- దమన్​ దయూ (2)లో నేడు పోలింగ్​ జరగనుంది.

ఎన్​సీపీ వర్సెస్​ ఎన్​సీపీ..
కొన్ని నెలల క్రితం.. ఎన్​సీపీ రెండుగా విడిపోయిన విషయం తెలిసిందే. ఇప్పుడు శరద్​ పవార్​ వర్గం, అజిత్​ పవర్​ వర్గం మధ్య తీవ్ర పోటీ కనిపిస్తోంది. బారామతిలో సుప్రియా సులేకు పోటీగా తన భార్యను దింపారు అజిత్​ పవర్​. ఇక్కడ నేడు పోలింగ్​ జరగనుంది.

Advertisement

ప్రధాని మోదీ ఓటు..
గుజరాత్​లోని 26 సీట్లకు నేడు పోలింగ్​ జరగనుంది. అహ్మదాబాద్​లోని ఓ పాఠశాలలో ప్రధాని మోదీ.. తన ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

హై ఓల్టేజ్​ సమరం..
మూడో దశ పోలింగ్​లో హై ఓల్టేజ్​ యాక్షన్​ కనిపించనుంది! అమిత్​ షా వంటి దిగ్గజ నేతలతో పాటు యూసఫ్​ పటాన్​ వంటి వారు.. నేటి ఎన్నికల్లో అభ్యర్థులగా ఉన్నారు.


బీజేపీకి కీలకం..

నేడు 93 సీట్లకు పోలింగ్​ జరగనుంది. 2019లో ఈ 93 సీట్లల్లో 72 చోట్ల బీజేపీ విజయం సాధించింది. వీటిల్లో 26 గుజరాత్​ నుంచే వచ్చాయి. మరి ఈసారి ఏ మేరకు ప్రదర్శన చేస్తుందా అని ఆసక్తి నెలకొంది.

లోక్​సభ ఎన్నికల మూడో దశ పోలింగ్​..
2024 లోక్​సభ ఎన్నికల మూడో దశ పోలింగ్​కు సమయం ఆసన్నమైంది. ఉదయం 7 గంటలకు పోలింగ్​ ప్రారంభమవుతుంది. 10 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లో నేడు ఓటింగ్​ జరగనుంది. నేటితో.. 543 సీట్లలో సగం సీట్లకు పోలింగ్​ ప్రక్రియ పూర్తవుతుంది.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version