National

దేశంలోనే అత్యంత తేలికైన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ను తయారుచేసిన…..డీఆర్‌డీఓ యూనిట్

Published

on

డిఫెన్స్‌ రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ (డీఆర్‌డీఓ) యూనిట్ హైయెస్ట్ థ్రెట్ లెవెల్-6లోనూ రక్షించగలిగే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్‌ను అభివృద్ధి చేసింది.

ఇది దేశంలొనే అత్యంత తేలికైన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్‌ను విజయవంతంగా అభివృద్ధి చేసినట్టు మంగళవారం డీఆర్‌డీఓ అధికారిక ప్రకటనలో వెల్లడించింది. ఈ జాకెట్ కొత్త డిజైన్‌తో రూపొందించబడిందని, అలాగే, దీని తయారీలో ప్రత్యేక మెటీరియల్‌ను ఉపయోగించడంతో పాటు, కొత్త పద్దతిని అనుసరించినట్టు రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ‘డీఆర్‌డీఓకు చెందిన డిఫెన్స్ మెటీరియల్స్ అండ్ స్టోర్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్(డీఎంఎస్ఆర్‌డీఈ) కాంపూర్ మందుగుండు సామగ్రి నుంచి రక్షణ కోసం దేశంలోనే అత్యంత తేలికైన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్‌ను అభివృద్ధి చేసింది. ఇటీవలే ఈ జాకెట్‌ను విజయంతంగా పరీక్షించామని ‘ మంత్రిత్వ శాఖ పేర్కొంది.

ఈ జాకెట్‌కు ఉన్న ఫ్రంట్ హార్డ్ ఆర్మర్ ప్యానెల్ పలు హిట్(ఆరు షాట్‌లు)లను ఎదుర్కొంది. సమర్థవంతంగా రూపొందించిన ఫ్రంట్ హార్డ్ ఆర్మర్ ప్యానెల్(హెచ్ఏపీ) పాలిమర్, మోనోలిథిక్ సిరామిక్ ప్లేట్‌తో తయారు చేశారు. ఇది ఆపరేషన్ సమయంలో సామర్థ్యాన్ని, సౌక్రయాన్ని పెంచుతుంది. ఈ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్‌ను విజయవంతంగా అభివృద్ధి చేసినందుకు రక్షణ శాఖ ఆర్అండ్‌డీ సెక్రటరీ, డీఆర్‌డీఓ చైర్మన్ డీఎంఎస్ఆర్‌డీఈని అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version