International
ఎండిన నయాగరా ను చూద్దాం…
: నయాగరా ప్రపంచంలోని ఎత్తయిన జలపాతం. అందమైన జలపాతం కూడా ఇదే. ఉత్తర అమెరికాలోని ఈ జలపాతంలో ఏడాదంతా నీటి ప్రవాహం ఉంటుంది. దీనిని సందర్శించేందుకు ఏటా లక్షల మంది పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు.
అమెరికా నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా సందర్శకులు వస్తారు. అయితే ఈ ఎత్తయిన జలపాతం ఎండిపోతే ఎలా ఉంటుందో ఎవరి ఊహకు అందదు. కానీ, ఈ జలపాతం ఆరు నెలలు చుక్క నీరు లేకుండా ఎండిపోయింది. ఎప్పుడు ఎండిపోయింది ఎందుకు ఎండిపోయిందో తెలుసుకుందాం.
1969లో నీరు లేకుండా..
1969లో అమెరికా ఆర్మీకార్ప్స్ ఆఫ్ ఇంజినీర్స్ నయాగారా నదికి ఆనకట్ట వేయడానికి యత్నించారు. ఇందుకోసం జలపాతాన్ని ఆపడానికి 27 వేల టన్నుల రాళ్లను డంప్ చేశారు. జలపాతాన్ని మళ్లించారు. ఆరు నెలలపాటు జలపాతంలో ప్రవాహం నిలిచిపోవడంతో జలపాతం ఎండిపోయి కనిపించింది. తర్వాత వాటిని తొలగించారు. ఇది ఏర్పడిన 12 వేల సంవత్సాల్లో తొలిసారి ప్రవాహనం నిలిచిపోయింది. కోత ప్రభావాలను అధ్యయనం చేయడానికి, క్లియర్ చేయడానికి నిర్మించిన తాత్కాలిక ఆనకట్ట కారణంగా ఇది జరిగింది.
పూర్తిగా రాతి పునాది..
జల ప్రవాహం నిలిచిపోవడంతో జలపాతం పునాదిలో రాతి శిథిలాలు కనిపించాయి. తర్వాత ఆనకట్ట తొలగించడంతో జలపాతం మీదుగా ప్రవాహం కొనసాగి సాధారణ స్థితికి వచ్చింది. జలపాతం అడుగున ఉన్న రాతిని భౌగోళిక సర్వే నిర్వహించారు. కోతకు గురైన రాళ్లు చాలా అస్థిరత చెందుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ఆనకట్ట నిర్మాణం ఇలా..
నయాగారా ప్రవాహాన్ని మళ్లించడానికి సైన్యం నదిపై 600 ఫీట్లు(182 మీటర్ల) ఎత్తులో ఆనకట్ట నిర్మించింది. దీనికి 27,800 టన్నుల రాళ్లను ఉపయోగించారు. ఆరు నెలల తర్వాత 2,650 మంది సందర్శకుల సమక్షంలో తాత్కాలిక ఆనకట్టను తొలగించారు.