Business
Income tax and TDS కు మధ్య తేడా ఏంటో తెలుసుకోండి
Income tax vs TDS: ట్యాక్స్ పేయర్లు ఇన్‌కంటాక్స్‌కు టీడీఎస్‌కు మద్య తేడా తెలుసుకోవాలి. ముఖ్యంగా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు ఈ రెండింటికీ అంతరం ఏంటనేది తెలుసుకుంటే ట్యాక్స్ ప్లానింగ్ సులభమైపోతుంది.
టీడీఎస్ అంటే ట్యాక్స్ డిడక్టెడ్ సోర్స్. ఇన్‌కంటాక్స్ మరియు టీడీఎస్ మధ్య చిన్న తేడా ఉండనే ఉంది.
ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసే సమయం వచ్చేసింది. ఏప్రిల్ 1 నుంచి ట్యాక్స్ ఫైలింగ్ పోర్టల్ ఓపెన్ అయింది. ఉద్యోగస్థులు మాత్రం ఫామ్ 16 కోసం ఇంకా నిరీక్షించాల్సి ఉంటుంది. ఫామ్ 16 చేతికి అందిన తరువాత ట్యాక్స్ ఫైలింగ్ ఉంటుంది. అంతకంటే ముందు ఇన్‌కంటాక్స్, టీడీఎస్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఈ రెండింటికీ మధ్య ఉన్న స్వల్ప తేడాను తెలుసుకోగలిగితే ట్యాక్స్ ప్లానింగ్ సులభమౌతుంది.
ఇన్‌కంటాక్స్ అంటే ఏమిటి
ఓ వ్యక్తి లేదా కంపెనీ వార్షిక ఆదాయంపై విధించేది ఇన్‌కంటాక్స్. అంటే మీ సంపాదనపై ప్రభుత్వానికి చెల్లించే ట్యాక్స్. ఇన్‌కంటాక్స్ చట్టం 1961 ప్రకారం నిబందనలు వర్తిస్తాయి. ప్రతి ఆర్ధిక సంవత్సరం చివర్లో ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. మీ జీతం, ఇంటి ఆస్థి ఆదాయం, వ్యాపారంలో లాభాలు, ఇతర పెట్టుబడుల లాభాలపై ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో రెండు రకాల ట్యాక్స్ విదానాలున్నాయి. ఒకటి ఓల్డ్ ట్యాక్స్ రెజీమ్, రెండవది న్యూ ట్యాక్స్ రెజీమ్. ఐటీఆర్ ఫైల్ చేయకుంటే ప్రభుత్వం జరిమానా విదిస్తుంది.
టీడీఎస్ అంటే ఏమిటి
ట్యాక్స్ డిడక్టెడ్ సోర్స్. ప్రతి ఉద్యోగికి కంపెనీ జీతం తప్పకుండా చెల్లిస్తుంటుంది. ఇందులోంచి కంపెనీ ప్రతి నెలా టీడీఎస్ నేరుగా కన్ చేసి ప్రభుత్వానికి చెల్లిస్తుంది. టీడీఎస్ అనేది జీతం నుంచి అద్దె నుంచి ఇతర ఆదాయ మార్గాల్నించి డిడక్ట్ అవుతుంది. జీతభత్యాలు, ఇన్వెస్ట్‌మెంట్ అండ్ రెంటల్ ఇన్‌కం, లాటరీలు, గాంబ్లింగ్, ప్రైజ్ మనీ ద్వారా వచ్చే డబ్బులు, కాంట్రాక్టర్లు, ఇన్సూరెన్స్, బ్రోకరేజ్ ఫీజులు వంటివాటిపై టీడీఎస్ కట్ అవుతుంది.
అంటే ఇన్‌కంటాక్స్ అనేది ఏడాదికోసారి ఆదాయంపై కట్ అయ్యేది. ఏడాది చివర్లో ట్యాక్స్ పేయర్ ప్రభుత్వానికి చెల్లిస్తాడు. కానీ టీడీఎస్ అనేది ఏడాది మొత్తం వివిధ మార్గాల్నించి వచ్చే ఆదాయంపై కట్ అయ్యేది. ఇన్‌కంటాక్స్ అనేది ఆ వ్యక్తి స్వయంగా ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు తన అర్హతను బట్టి చెల్లిస్తాడు. అదే టీడీఎస్ అయితే ఆ వ్యక్తికిచ్చే డబ్బుల్నించి కంపెనీనే ప్రభుత్వానికి చెల్లిస్తుంది.