National

‘కావడి యాత్ర శాంతియుతంగా సాగాలనే అలా చేశాం’- నేమ్ బోర్డుల ఏర్పాటుపై సుప్రీంలో యూపీ అఫిడవిట్​

Published

on

UP Government On Kanwar Yatra Case : కావడి యాత్ర మార్గంలో తినుబండారాలు విక్రయించేవారు తమ యజమానుల పేర్లను తప్పనిసరిగా ఆహారశాలలపై ప్రదర్శించాలన్న ఉత్తర్వులను తాజాగా ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం సమర్థించుకుంది. తీర్థయాత్ర శాంతియుతంగా, క్రమబద్ధంగా సాగేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించింది. ఈ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లను వ్యతిరేకిస్తూ, సుప్రీంకోర్టుకు తాజాగా తమ వివరణను తెలియజేసింది. ఆహారశాలలు, తినుబండారాల పేర్ల విషయంలో సంశయం తలెత్తుతోందని యాత్రికులు ఫిర్యాదు చేశారని ప్రభుత్వం చెప్పింది. వారి ఆందోళనలను పరిష్కరించేందుకే ఉత్తర్వులు జారీ అయ్యాయని, అందుకు అనుగుణంగా పోలీసులు చర్యలు తీసుకున్నారని పేర్కొంది. అంతకుముందు యూపీ ప్రభుత్వ ఉత్తర్వులపై సుప్రీంకోర్టు సోమవారం స్టే విధించింది. విక్రయించేది శాకాహారమా, మాంసాహారమా అనేది ప్రదర్శిస్తే సరిపోతుందని, హోటల్‌ యజమానులు ఎవరు అందులో పనిచేసేవారెవరు అనే వివరాల కోసం బలవంతం చేయాల్సిన అవసరం లేదని పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version