National

Kargil Vijay Diwas 2024 : ఉగ్రవాదాన్ని ఉపేక్షించేది లేదు.. కార్గిల్ యుద్ధ వీరులకు నివాళులర్పించిన ప్రధాని మోదీ

Published

on

PM Narendra Modi : భారత భూభాగాన్ని ఆక్రమించాలని ప్రయత్నించిన పాకిస్థాన్ సేనలను తరిమికొట్టిన భారత సైన్యం వీర పరాక్రమానికి ప్రతీక కార్గిల్ యుద్ధం. ఆ విజయగాథకు నేటితో పాతికేళ్లు అవుతుంది. ఈ నేపథ్యంలో కార్గిల్ 25వ విజయ్ దివస్ ను పురస్కరించుకొని కార్గిల్ లోని ద్రాస్ లో యుద్ధవీరుల స్మారకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించారు. అనంతరం యుద్ధంలో ప్రాణాలు అర్పించిన వీర సైనికులకు అంజలి ఘటించారు. అనంతరం అమర జవాన్ల సతీమణులు, కుటుంబ సభ్యులతో ప్రధాని మోదీ కొద్దిసేపు ముచ్చటించారు.

ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. అమరుల త్యాగాలకు గుర్తుగా విజయ్ దివస్ జరుపుకుంటున్నాం. దేశంకోసం సైనికులు చేసిన త్యాగాలు చరిత్రలో నిలిచిపోతాయి. కార్గిల్ విజయం భారత సైనికుల పరాక్రమానికి నిదర్శనం. 1999లో కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న సైనికులను కలిశాను. సైనికుల త్యాగాలు వెలకట్టలేనివి. కార్గిల్ యుద్ధ సమయంలో సామాన్యుడిలా సైనికుల మధ్య ఉన్నాను. దేశంకోసం వారు చేసిన పోరాటం నా మదిలో నిలిచిపోయింది. పాకిస్థాన్ గత అనుభవాల నుంచి ఎలాంటి గుణపాఠాలు నేర్చుకోలేదన్న మోదీ.. ఉగ్రవాదాన్ని ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.

కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఎక్స్ వేదికగా అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు. 1999 నాటి కార్గిల్ యుద్ధంలో మాతృభూమి కోసం ప్రాణాలు అర్పించిన ప్రతి జవాన్ కు నివాళులర్పించారు. ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకం వద్ద కేంద్ర రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ అమర జవాన్లకు నివాళులర్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version