Andhrapradesh

Kakinada : బోట్లకు నిప్పంటించి మరీ మత్స్యకారుల నిరసన – కాకినాడలో ఉద్రిక్తత

Published

on

Kakinada News : కాకినాడ(Kakinada) లో మత్స్యకారులు(Fisherman) ఉద్యమం ప్రారంభించారు. ఉప్పాడ దగ్గర ఉన్న అరబిందో ఫార్మసీ కంపెనీ(Aurobindo Pharmacy Company) కి వ్యతిరేకంగా ఆందోళనలను నిర్వహిస్తున్నారు.
దీంతో యు.కొత్తపల్లి మండలం కోనపాపపేటలో టెన్షన్ నెలకొంది. తమ బోట్లకు నిప్పంటించి మరీ మత్స్యకారులు నిరసన తెలుపుతున్నారు. సముద్రంలో వేసిన అరబిందో పైప్లైన్ను వెంటనే తొలగించాలంటూ ధర్నా చేస్తున్నారు. మూడు రోజులు నుంచి ఆందోళన చేస్తున్నా..అధికారులు పట్టించుకోవడం లేదని మత్స్యకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. అరబిందో పైప్లైన్ తీయకపోతే మత్స్య సంపద కనుమరుగు అవుతుందని వారు అంటున్నారు. వెంటనే పైప్లైన్ తొలగించాలని కొంతమంది మత్స్యకారులు ఒంటి మీద కిరోసిన్ పోసుకున్నారు.

ఉప్పాడ గ్రామంలో ఉద్రిక్తత
మత్స్యకారుల ఆందోళనతో ఉప్పాడ(Uppada) గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బోట్లు తగలెట్టడం, ఒంటి మీద కిరోసిన్ పోసుకోవడం వటంఇవి చేయడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎవరికీ ఎటువంటి గాయాలు కాకుండా చ్యలు తీసుకుంటున్నారు. మత్స్యకారులను అదుపు చేసేందుకు పోలీసు బలగాలను దించారు. బ్యానర్లతో పెద్ద సంఖ్యలో చేరుకున్న మత్స్యకారులు ఆదంఓళన చేస్తున్నారు. అరబిందో ఉప్పాడ దగ్గర సముద్రంలోకి పైప్లైన్లను వేసింది. తన కంపెనీ నుంచి వచ్చే వ్యర్ధ పదార్ధాలను ఈ పైన్ లైన్ల ద్వారా సముద్రంలోకి పంపిస్తోంది. వీటివలన సముద్రంలో నీరు అంతా కలుషితమయిపోతోంది. దీంతో అక్కడ సముద్రంలో ఉన్న చేపలు చచ్చిపోతున్నాయి. మత్స్య సంపద కనుమరుగు అయిపోతోంది.

మత్స్యకారుల జీవనోపాధికి దెబ్బకొట్టేలా వ్యర్థాల పైప్ లైన్
ఉప్పాడ తీరంలో చేపల వేటను ఆధారంగా చేసుకుని చాలా మంది మత్స్యకారులు బతుకుతున్నారు. ఇప్పుడు వారి జీవనోపాధికే భంగం కలిగే ఆపద వాటిల్లింది. అందుకే మత్స్యకారులు పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నారు. ఇంతకు ముందే దీని గురించి అధికారులకు చెప్పినా పట్టంచుకోలేదు. నేతలతో మొరపెట్టుకున్న పని జరగలేదని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. అందుకే ఇప్పుడు ధర్నా చేస్తున్నామని తెలిపారు. సుమారు వెయ్యి మంది మత్స్యకారులు మూడు రోజుల నుంచి ఆందోళన చేస్తున్నారు.

మత్స్యకారులతో అధికారుల చర్చలు
సముద్రంలోకి పారిశ్రామిక వ్యర్థ జలాలను.. అదీ కూడా ఫార్మా కంపెనీ వ్యర్థాలను వదల కూడదు. కానీ అరబిందో కంపెనీ అదే పని చేస్తూండటం.. అధికారులు ఎవరూ పట్టించుకోకపోవడంతో మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చివరికి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీనిపై అధికారులు.. ఆందోళనకారులకు నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు. తగిన విధంగా చర్చిస్తామని.. సముద్రంలో వ్యర్థజలాలు వదలకుండా చూస్తామని హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version