Andhrapradesh

JEE Main 2024 Result: సత్తా చాటిన తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు.. 100 స్కోర్ సాధించిన 23 మందిలో 10 మంది మనోళ్లే.. వివరాలు ఇవే..

Published

on

దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ మెయిన్ 2024 సెషన్ 1 ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి.
ఈ పరీక్షలో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. జేఈఈ మెయిన్ 2024 సెషన్ 1లో 23 మంది అభ్యర్థులు 100 స్కోర్ సాధించగా.. అందులో తెలంగాణకు చెందిన అభ్యర్థులు అత్యధికంగా ఉన్నారని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) తెలిపింది. 100 ఎన్‌టీఏ స్కోర్‌లు సాధించిన అభ్యర్థుల్లో తెలంగాణ నుంచి ఏడుగురు, హర్యానా నుంచి ఇద్దరు, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర నుంచి ముగ్గురు చొప్పున, ఢిల్లీ నుంచి ఇద్దరు, గుజరాత్, కర్ణాటక, తమిళనాడు నుంచి ఒక్కొక్కరు ఉన్నారు. ఇలా చూస్తే.. 100 స్కోర్ సాధించిన 23 మంది అభ్యర్థుల్లో 10 మంది తెలుగు రాష్ట్రాలకు చెందినవారే కావడం గమనార్హం.

ఈ జాబితాను చూస్తే.. తెలంగాణకు చెందిన రిషి శేఖర్ శుక్లా, రోహాన్ సాయి పబ్బ, ముతవరపు అనూప్, హండేకర్ విదిత్, వెంకటసాయి తేజ మదినేని, శ్రీయాషస్ మోహన్ కల్లూరి, తవ్వ దినేష్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన షేక్ సూరజ్, తోట సాయి కార్తీక్, అన్నారెడ్డి వెంకట తనీష్ రెడ్డిలు 100 స్కోర్ సాధించారు.

ఇక, జేఈఈ మెయిన్ 2024 సెషన్ 1 పరీక్ష జనవరి-ఫిబ్రవరిలో నిర్వహించారు. సెషన్ 2 ఏప్రిల్‌లో జరగాల్సి ఉంది.మొదటి సెషన్ పరీక్ష జనవరి-ఫిబ్రవరిలో నిర్వహించగా, రెండో సెషన్ ఏప్రిల్‌లో జరగాల్సి ఉంది. జేఈఈ మెయిన్ సెషన్ 1 రాసిన అభ్యర్థులు.. సెషన్ 2కు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఫలితాల (రెండు సెషన్‌లలో రాస్తే అందులో ఉ్తతమమైనది) ఆధారంగా.. అభ్యర్థులు జేఈఈ-అడ్వాన్స్‌డ్ పరీక్షకు హాజరయ్యేందుకు షార్ట్‌లిస్ట్ చేయబడతారు. ఇది 23 ప్రీమియర్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లో అడ్మిషన్ పొందడానికి ఉద్దేశించిన పరీక్ష.

ఇక, జేఈఈ మెయిన్ సెషన్ 1 పరీక్షకు 11.70 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. అస్సామీ, బెంగాలీ, ఇంగ్లీష్, గుజరాతీ, హిందీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళం, తెలుగు, ఉర్దూ భాషల్లో పరీక్ష జరిగింది. ఈ పరీక్ష కోసం భారతదేశం వెలుపల మనామా, దోహా, దుబాయ్, ఖాట్మండు, మస్కట్, రియాద్, షార్జా, సింగపూర్, కువైట్ సిటీ, కౌలాలంపూర్, లాగోస్/అబుజా, కొలంబో, జకార్తా, మాస్కో, ఒట్టావా, పోర్ట్ లూయిస్, బ్యాంకాక్, వాషింగ్టన్ డీసీలలో కూడా నిర్వహించారు. అయితే అబుదాబి, హాంకాంగ్, ఓస్లోలో ఈ పరీక్ష నిర్వహించడం ఇదే మొదటిసారి.

సంబంధిత వార్తలుPrevious

Advertisement

AP DSC NOTIFICATION-2024: నోటిఫికేషన్ విడుదల..ముఖ్యమైన తేదీలు, సిలబస్, వయోపరిమితి పూర్తి డిటైల్స్ ఇవే

AP POLYCET-2024: ప్రవేశ పరీక్ష తేదీ, ఫ్రీ కోచింగ్ సెంటర్స్, సీట్లు పూర్తి డిటైల్స్ ఇవే

రాజ్యసభకు వైసీపీ అభ్యర్థుల నామినేషన్లు దాఖలు: ఏకగ్రీవమయ్యేనా?

జనసేన పార్టీ టికెట్లపై పవన్ కల్యాణ్ కసరత్తు: 30 మంది దాదాపు ఖరారు

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version