National

JEE Advanced 2024: నేడే జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష.. ఆఖరి నిమిషంలో ఈ పొరబాట్లు చేయకండి!

Published

on

దేశవ్యాప్తంగా జేఈఈ అడ్వాన్స్‌డ్ 2024 పరీక్ష ఈ రోజు (మే 26) ఎన్‌టీఏ నిర్వహించనుంది. ఆదివారం రెండు షిఫ్టుల్లో ఈ పరీక్ష జరుగుతుంది. తెలుగు రాష్ట్రాలైన ఏపీలో 26, తెలంగాణలో 13 నగరాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష మొత్తం రెండు పేపర్లకు ఉంటుంది. ఒక్కొక్క పేపర్‌ రాసేందుకు 3 గంటల వ్యవధి ఉంటుంది. అభ్యర్థులు రెండు పేపర్లకు హాజరు కావాల్సి ఉంటుంది. మొదటి పేపర్‌ ఉదయం 9 నుంచి 12 గంటల వరకు నిర్వహిస్తారు. ఇక రెండో పేపర్‌ మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల మధ్య నిర్వహిస్తారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఈ పరీక్షకు దాదాపు 40 వేల మందికిపైగా దరఖాస్తు చేసుకున్నారు. ఇక దేశ వ్యాప్తంగా 2.50 లక్షల మంది విద్యార్ధులు అడ్వాన్స్‌డ్ రాయనున్నారు. జేఈఈ మెయిన్స్‌లో ఉత్తమ ర్యాంకు పొందిన వారిని మాత్రమే ఈ పరీక్షకు అనుమతిస్తారు. ఇక జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో కూడా ఉత్తీర్ణులైతే ఐఐటీల్లో బీటెక్‌ సీట్లకు పోటీ పడేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఈ పరీక్షకు సంబంధించిన అడ్మిట్‌ కార్డులు వెబ్‌సైట్‌లో అందుబాటులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో నేడు పరీక్ష రాసేందుకు హాజరయ్యే అభ్యర్థులు ఈ కింది జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

జేఈఈ అడ్వాన్స్‌డ్ 2024 పరీక్ష రాసే అభ్యర్థులకు ముఖ్యమైన సూచనలు..

  • పరీక్షకు హాజరయ్యే అభ్యర్ధులు తప్పనిసరిగా వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్ చేసుకన్నఅడ్మిట్ కార్డును తమతోపాటు ఎగ్జామినేషన్‌ సెంటర్‌కు తీసుకెళ్లాలి. అలాగే ఒక ఒరిజినల్ ఫొటో కూడా తీసుకెళ్లాలి.
  • ఆధార్ కార్డ్, పాఠశాల/ కాలేజీ లేదా ఏదైనా విద్యా సంస్థ గుర్తింపు కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటరు ఐడీ, పాస్‌పోర్టు, పాన్ కార్డు తదితరాల్లో ఏదైనా ఒకటి కచ్చితంగా తమతోపాటు తీసుకెళ్లాలి.
  • పెన్నులు, పెన్సిళ్లు, తాగునీటి బాటిల్స్‌ లోపలికి తీసుకెళ్లేందుకు అనుమతి ఉంటుంది.
  • పాకెట్స్ లేకుండా వదులుగా ఉండే దుస్తులు మాత్రమే అభ్యర్ధులు ధరించాలి.
  • దుస్తులపై బంగారు లేదా ఇతర మెటల్‌ ఆభరణాలు, నగలు ఉంటే అటువంటి వారిని లోనికి అనుమతించరు.
  • స్కార్ఫ్‌లు, మఫ్లర్‌లు, స్టోల్స్, షాల్స్, టోపీలు, రంగుల కళ్ళద్దాలు వంటివి ధరించరాదు.
  • బూట్లు, మందమున్న చెప్పులు వేసుకున్న వారిని కూడా అనుమతించరు.
  • ఎలాంటి లోహాలతో కూడిన వస్తువులనైనా ఒంటిపై ధరించి పరీక్ష కేంద్రంలోకి వెళ్లరాదు.
  • ఉంగరాలు, గాజులు, మెట్టెలు, మెడలో చైన్లు వేసుకున్న వారిని కూడా అనుమతించారు.
  • మొబైల్ ఫోన్లు, వాచ్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించరు.
  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    Trending

    Exit mobile version