National

స్ట్రాంగ్ రూమ్‌కు జగన్నాథుని అమూల్య సంపద.. త్వరలోనే విగ్రహాల విలువ లెక్కింపు

Published

on

Inner Ratna Bhandar Valuables Shifted : కోట్ల మంది ఎదురుచూసిన పూరీ రత్న భాండాగారంలో మూడవ గదిలో విలువైన వస్తువుల తరలింపు ప్రక్రియ పూర్తైంది. దాదాపు 7 గంటల పాటు శ్రమించి అల్మారాలు, పెట్టెల్లో ఉన్న వస్తువులను తరలించారు. ఆలయంలో ఉన్న ఖజానాలో భద్రపరిచారు. ఎటువంటి అనుమానాలకు తావు ఇవ్వకుండా పూర్తిగా వీడియోగ్రఫీ చేశారు. సంపద తరలింపు పూర్తైన తర్వాత కొత్త, పాత భాండాగారాలకు తాళం వేసి సీజ్ చేశారు. రత్న భండార్ లో భారీ విగ్రహాలు బయటపడ్డాయి. దశాబ్ద కాలం గడవటంతో లోహ విగ్రహాలు కొన్ని నల్లగా మారినట్లు తెలుస్తోంది. 11 సభ్యుల బృందం 5 రోజుల వ్యవధిలో 2వ సారి రత్న భండార్ ను తెరిచింది. ఇక రత్న భండార్ లోపలి భాగంలో అమూల్య సంపదను తాము పరిశీలించామని జస్టిస్ విశ్వనాథ్ రథ్ చెప్పారు.

రత్న భండార్ కు అవసరమైన మరమ్మతులు పురావస్తు శాఖ చేస్తుందని, ఆ తర్వాతే స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచిన ఆభరణాలు, ఇతర వస్తువుల జాబితా తయారీ ప్రక్రియ మొదలవుతుందని పూరీ రాజవంశీకుడు తెలిపారు. లోపలి చాంబర్ కింద సొరంగం ఉందీ లేనిది సర్వేలోనే తేలుతుందన్నారు. అమూల్య వస్తువులు, నగల తరలింపు ప్రక్రియను వీడియోలో చిత్రీకరించినట్లుగా పూరీ కలెక్టర్ చెప్పారు. ఆలయం చుట్టుపక్కల భారీ భద్రత కల్పించారు. మరోవైపు బయటపడిన విగ్రహాల విలువ త్వరలోనే లెక్కించబోతున్నారు. రత్న భండార్ పగుళ్లను పూర్తిగా మరమ్మతులు చేసిన తర్వాతే స్టాండర్డ్ ఆపరేటింగ్ విధానం ప్రకారం ఇన్ వెంటరీ పనులు జరగనున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version