International

రఫాపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం- వైమానిక దాడిలో 35మంది మృతి – Israel Hamas War

Published

on

Israel Airstrike On Rafah : ఇజ్రాయెల్‌ రాజధాని టెల్‌ అవీవ్‌పై హమాస్‌ చేసిన దాడికి ప్రతీకారంగా ఆ దేశ సైన్యం గాజా నగరంపై బాంబుల వర్షం కురిపించింది. దక్షిణ గాజాలోని రఫా నగరంపై ఇజ్రాయెల్‌ సైన్యం జరిపిన వైమానిక దాడుల్లో దాదాపు 35 మంది పాలస్తీనియన్లు మరణించారు. నివాసితులు ఉంటున్న గుడారాలపై వరుస బాంబు దాడులు జరిగాయని గాజా వైద్యారోగ్య శాఖ వె‌ల్లడించింది. ఈ దాడుల్లో పలువురు గాయపడినట్లు తెలిపింది. దాడి జరిగిన ప్రాంతంలో పెద్ద సంఖ్యలో ప్రజలు ఉండడం వల్ల మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. అటు ఈ దాడిని ఇజ్రాయెల్‌ ఖండించింది. ఆ ప్రాంతంలో ఏం జరుగుతుందో తమకు తెలియదని ఇజ్రాయెల్‌ సైన్యం పేర్కొంది. అంతకుముందు టెలీ అవీవ్‌పై హమాస్‌ దీర్ఘ శ్రేణి రాకెట్లతో విరుచుకుపడింది. తమ పౌరులపై జరుగుతోన్న మారణకాండకు ప్రతీకారంగా ఈ దాడులు చేసినట్లు తెలిపింది. గాజా స్ట్రిప్ నుంచి రాకెట్ దాడులు జరిపినట్లు హమాస్ పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version