International
ఇరాన్ అధ్యక్షుడు మృతి… ధ్రువీకరించిన ఇరాన్
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మృతి చెందినట్లు ఆ దేశ అధికారులు ధృవీకరించారు. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూలిపోయి 20 గంటలకు పైగా గడిచింది. సోమవారం ఉదయం ఆయన ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ కూలిపోయిన ప్రదేశాన్ని మాత్రం అధికారులు గుర్తించారు.
అయితే ఆ ప్రదేశంలో ఒక్కరు కూడా జీవించి లేరని అధికారులు తెలిపారు. హెలికాఫ్టర్ కూలిన ప్రదేశం నిటారుగా ఉన్న లోయలో ఉంది.
అధికారులు కానీ, సిబ్బంది కానీ ప్రమాదం జరిగిన ప్రదేశానికి చేరుకోలేరని అధికారులు వివరించారు. హెలికాప్టర్ ఆదివారం కుప్పకూలింది రైసీ, విదేశాంగ మంత్రి హొస్సేన్ అమిరబ్డోల్హియాన్ ఇతరులు ఉన్నారు