International
ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్‌కు ప్రమాదం- అందరిలోనూ టెన్షన్ టెన్షన్ – Iran President Helicopter Accident
Iran President Helicopter Accident : ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. రాజధాని టెహ్రాన్‌కు 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న జోల్ఫా నగరం సమీపంలో ఈ ఘటన జరిగింది. ఆ దేశ అధికారిక మీడియా ఈ విషయాన్ని ప్రకటించింది. అయితే, ప్రస్తుతం అధ్యక్షుడి పరిస్థితి ఎలా ఉందనే విషయంపై ఎలాంటి సమాచారం వెల్లడించలేదు. ప్రమాద స్థలానికి చేరుకునేందుకు సహాయక బృందాలు ప్రయత్నిస్తున్నాయని ఇరాన్ అధికారిక మీడియా తెలిపింది. అయితే, ప్రతికూల వాతావరణం ఇందుకు అవరోధంగా మారిందని చెప్పింది. ఆ ప్రాంతంలో భారీ వర్షం కురుస్తోందని, గాలులు వీస్తున్నాయని పేర్కొంది.
ఇబ్రహీం రైసీ(63) ఆదివారం అజర్బైజాన్ పర్యటనకు వెళ్లారు. అరస్ నదిపై రెండు దేశాలు కలిసి నిర్మించిన డ్యామ్‌ను ఆయన అజర్బైజాన్ అధ్యక్షుడు ఇల్హం అలియేవ్‌తో కలిసి ప్రారంభించాలన్నది ప్రణాళిక. అయితే, ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ అనూహ్యంగా ప్రమాదానికి గురైంది.