Cricket
IPL 2024 : మయాంక్ యాదవ్ బౌలింగ్ పై పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర ధావన్ ఆసక్తికర వ్యాఖ్యలు
PBKS vs LSG: ఐపీఎల్ 2024లో శనివారం లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ) వర్సెస్ పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో సూపర్ జెయింట్స్ జట్టు బోణీ కొట్టింది. తొలి మ్యాచ్ లో రాజస్థాన్ చేతిలో ఓడిపోయిన ఆ జట్టు పంజాబ్ కింగ్స్ జట్టుపై 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. పంజాబ్ కింగ్స్ జట్టు టోర్నీలో ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్ లలో రెండు మ్యాచ్ లు ఓడిపోయి పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో నిలిచింది. లక్నోపై ఓటమి తరువాత ఆ జట్టు కెప్టెన్ శిఖర్ ధావన్ మాట్లాడారు. పంజాబ్ కింగ్స్ జట్టు ఆటగాళ్లు ఎక్కడ తప్పు చేశారో చెప్పాడు.
మేము మా ఓటమిలను సమీక్షించుకుంటాం. మా లోపాలను సరిదిద్దుకుంటాం. మా జట్టు ఆటగాళ్లు వదిలేసిన క్యాచ్ లు, పేలువమైన ఫీల్డింగ్ ను మెరుగుపర్చుకోవాల్సిన అవసరం ఉంది. రాబోయే మ్యాచ్ లో మా లోపాలను సరిదిద్దుకుంటామని ధావన్ అన్నారు. లియామ్ లివింగ్ స్టోన్ గాయపడటం మా జట్టుకు ఇబ్బందికర విషయం. అతను గాయపడకపోయిఉంటే ఫోర్త్ ప్లేస్ లో బ్యాటింగ్ కు వచ్చేవాడు. లక్నో జట్టు ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ బౌలింగ్ గురించి ధావన్ ప్రస్తావించాడు. మయాంక్ బౌలింగ్ వేగం చూసి ఆశర్యపోయానని అన్నాడు. నేను మయాంక్ పేస్, బౌన్స్ ను ఉపయోగించుకోవాలని అనుకున్నా. కానీ, అతను అద్భుతమైన బౌన్సర్లు, యార్కర్లను వేశాడని ధావన్ ప్రశంసించాడు.
ఢిల్లీకి చెందిన రైట్ ఆర్మ్ పేసర్ మయాంక్ యాదవ్. లక్నో సూపర్ జెయింట్స్ జట్టు తరుపున శనివారం ఐపీఎల్ లో అడుగు పెట్టాడు. అరంగేట్రం మ్యాచ్ లోనే అత్యంత వేగవంతమైన బంతులతో పంజాబ్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. మయాంక్ తొలి నుంచి నిలకడగా 145kmph కంటే ఎక్కువ వేగంతో బంతులు వేశాడు. ఒక దశలో మయాంక్ వేసిన బంతి 155.8 kmph వేగంతో దూసుకెళ్లింది. ఈ ఐపీఎల్ లో అత్యంత వేగవంతమైన బంతి అదేకావటం విశేషం.