Career

IOCL Recruitment 2024: ఐఓసీఎల్ లో జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

Published

on

IOCL Recruitment 2024: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్, ఇతర పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు ఐఓసీఎల్ అధికారిక వెబ్సైట్ iocl.com ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్ మెంట్ డ్రైవ్ ద్వారా సంస్థలో 476 పోస్టులను భర్తీ చేయనున్నారు.

లాస్ట్ డేట్ ఆగస్ట్ 21..
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లో జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ పోస్ట్ లకు అప్లై చేసుకోవడానికి ఆఖరు తేదీ ఆగస్ట్ 21. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆగస్ట్ 21 లోపు ఐఓసీఎల్ అధికారిక వెబ్సైట్ iocl.com ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత, ఎంపిక విధానం, ఇతర వివరాల కోసం కింద చదవండి.

ముఖ్యమైన తేదీలు
దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్టు 21, 2024
ఈ-అడ్మిట్ కార్డు విడుదల: సెప్టెంబర్ 10,
2024 కంప్యూటర్ ఆధారిత పరీక్ష: సెప్టెంబర్ మూడో వారం, 2024
ఫలితాలు: అక్టోబర్ 3వ వారంలోగా

ఖాళీల వివరాలు
జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ IV -379 పోస్టులు
జూనియర్ క్వాలిటీ కంట్రోల్ : 21 పోస్టులు
ఇంజినీరింగ్ అసిస్టెంట్ : 38 పోస్టులు
టెక్నికల్ అటెండెంట్ : 29 పోస్టులు

అర్హతలు
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOCL) లో జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి తదితర వివరాలను {సీఎల్ అధికారిక వెబ్సైట్ iocl.com లో తెలుసుకోవచ్చు.

Advertisement

ఎంపిక విధానం
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT), స్కిల్/ప్రొఫిషియన్సీ/ఫిజికల్ టెస్ట్ (SPPT) ద్వారా అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎస్పీపీటీ క్వాలిఫయింగ్ స్వభావం కలిగి ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్షలో 100 ప్రశ్నలతో కూడిన ఒక ఆబ్జెక్టివ్ టైప్ పేపర్ ఉంటుంది. ఈ పరీక్షను పూర్తి చేయడానికి కేటాయించిన సమయం 120 నిమిషాలు. ఒక విభాగానికి సంబంధించి సీబీటీని ఒకే రోజులో ఒకటి/రెండు/మూడు సెషన్లలో నిర్వహించవచ్చు. ఎస్పీపీటీకి అర్హత సాధించడానికి షార్ట్ లిస్ట్ చేయడానికి ప్రతి అభ్యర్థి కంప్యూటర్ ఆధారిత పరీక్షలో కనీసం 40% మార్కులు సాధించాలి.

దరఖాస్తు ఫీజు
జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ (NCL) అభ్యర్థులు రూ.300/- అప్లికేషన్ ఫీజు (నాన్ రిఫండబుల్) ఆన్లైన్ పేమెంట్ గేట్ వే ద్వారా మాత్రమే చెల్లించాలి. వర్తించే బ్యాంకు ఛార్జీలను అభ్యర్థి భరించాల్సి ఉంటుంది. మరిన్ని వివరాలకు అభ్యర్థులు ఐఓసీఎల్ అధికారిక వెబ్సైట్ను చూడవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version