Cricket

India vs Ireland T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా తొలి మ్యాచ్ ఈరోజే.. లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Published

on

India vs Ireland T20 World Cup 2024: మరో టీ20 వరల్డ్ కప్ గెలుపు కోసం 2007 నుంచి వేచి చూస్తున్న టీమిండియా.. ఈసారి కూడా ఫేవరెట్స్ లో ఒకటిగా తన వేట మొదలుపెట్టబోతోంది. ఐర్లాండ్ తో న్యూయార్క్ లోని నాసౌ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది.

గ్రూప్ ఎలో భాగంగా ఇండియా, ఐర్లాండ్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం ఈరోజు రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుంది.

ఇండియా, ఐర్లాండ్ మ్యాచ్ ను స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ లో చూడొచ్చు. అంతేకాదు వరల్డ్ కప్ లో ఇండియా ఆడే మ్యాచ్ లను డీడీ స్పోర్ట్స్ కూడా అందిస్తుండటం విశేషం.

డిజిటల్ ప్లాట్‌ఫామ్ పై చూడాలనుకుంటే హాట్‌స్టార్ లో చూడొచ్చు. మొబైల్ యాప్ లో అయితే అన్ని టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ లు ఫ్రీగా చూసే వీలుంది.

ఐర్లాండ్ తో మ్యాచ్ లో తుది జట్టు ఏది? ఓపెనర్లుగా ఎవరు వస్తారన్నదానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. రోహిత్ తో కోహ్లి ఓపెనింగ్ చేస్తాడా లేక యశస్వియా అన్నది తేలనుంది.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version