Andhrapradesh
భారత్ దిశగా దూసుకొస్తున్న రాకాసి కెరటాలు.. పలు రాష్ట్రాలకు ఇన్‌కాయిస్ హెచ్చరికలు
దక్షిణ అట్లాంటిక్ మహాసముద్రంలో వారం రోజుల కిందట మొదలైన రాకాసి అలలు క్రమంగా భారత తీరానికి దూసుకొస్తున్నాయని ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ (ఇన్‌కాయిస్) హెచ్చరించింది.
ఇవి మే 4-5 మధ్య (శనివారం- ఆదివారం మధ్య) గోవా, మహారాష్ట్ర, పశ్చిమ్ బెంగాల్, ఒడిశా, తమిళనాడు, కేరళ, లక్షద్వీప్, కర్ణాటక, గుజరాత్, అండమాన్ నికోబార్ దీవుల తీరంపై విరుచుకుపడే అవకాశం ఉందని అప్రమత్తం చేసింది. ముఖ్యంగా లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవులు, కేరళ, దక్షిణ తమిళనాడు తీరంలో రెండు రోజుల పాటు సముద్రం ఉగ్రరూపం దాల్చనుందని ఇన్‌కాయిస్ శుక్రవారం హెచ్చరికలు జారీ చేసింది.